Major changes in GST: భారతదేశ పన్నుల వ్యవస్థలో త్వరలో పెద్ద మార్పు రాబోతుంది. కేంద్ర ప్రభుత్వం గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ)లో ఉన్న 12% స్లాబ్‌ను తొలగించాలని ఆలోచిస్తోంది. దీనికి ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ సిస్టమ్ ప్రారంభం అయిన ఎనిమిదేళ్ల తర్వాత ఇంత పెద్ద మార్పు జరుగడం ఇదే తొలిసారి. త్వరలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు వల్ల వినియోగదారులపై, వ్యాపారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ వార్తలో తెలుసుకుందాం.
Also Read: పెద్ద పేపర్ విలేకరి క్రిప్టో కరెన్సీ దందా.. పెద్ద తలకాయలకు డేంజర్ బెల్స్! పోస్టులు ఊస్టేనా!
ప్రస్తుతం జీఎస్టీలో ఐదు స్లాబులు ఉన్నాయి. అవి 0%, 5%, 12%, 18%, 28%. దీనితో పాటు బంగారం, వెండి వంటి వాటిపై 0.25%, 3% స్పెషల్ స్లాబులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం 12% స్లాబ్‌లో ఉన్న వస్తువులను 5% లేదా 18% స్లాబ్‌లోకి మార్చాలని ప్రతిపాదించింది. దీని ముఖ్య ఉద్దేశం పన్నుల వ్యవస్థను మరింత సులభతరం చేయడమే.
ప్రస్తుతం ఉన్న అనేక స్లాబ్‌లు వ్యాపారులకు, వినియోగదారులకు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. స్లాబ్‌ల సంఖ్య తగ్గడం వల్ల వ్యాపార ప్రక్రియలు సులభతరం అవుతాయి. ప్రభుత్వం జీఎస్టీని మరింత సరళంగా మారిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని భావిస్తోంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్‌తో పాటు, దేశీయ పరిశ్రమలకు కూడా ఈ మార్పులు సాయపడతాయి. అంతేకాకుండా చాలా కాలం నుంచి పరిశ్రమ వర్గాలు జీఎస్టీలో మార్పులు కావాలని కోరుతున్నాయి. ప్రస్తుత స్లాబ్‌ల సంఖ్య అధికంగా ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నాయి.
Also Read:ఇక మీదట అద్దె కాదు.. ఈఎంఐ కట్టండి.. పీఎఫ్ తో సొంతింటి కల సాకారం
ఇప్పుడున్న 12% స్లాబ్ తొలగిస్తే వస్తువుల ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది. 12% స్లాబ్‌లో ఉన్న వస్తువులు 5% స్లాబ్‌లోకి మారితే, ఆ వస్తువుల ధరలు తగ్గుతాయి. అదే వస్తువులు 18% స్లాబ్‌లోకి మారితే వాటి ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం 12% స్లాబ్‌లో సుమారు 19% వస్తువులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని 5%లోకి, మరికొన్నింటిని 18%లోకి మారుస్తారు. ఏయే వస్తువులను ఏ స్లాబ్‌లోకి మారుస్తారనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చాక.. ఏ వస్తువుల ధర పెరుగుతుందో, తగ్గుతుందో తెలుస్తుంది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ మార్పుల గురించి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలను మొదలు పెట్టింది. జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ ప్రతిపాదనపై చర్చించి, అన్ని రాష్ట్రాల ఆమోదం పొందిన తర్వాతనే ఈ మార్పులు అమలులోకి వస్తాయి. ఈ సమావేశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తర్వాత అంటే ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉంది. ఈ మార్పులకు సంబంధించిన బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ముందు ఉంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.