Mahindra Bolero 2025: ఆటోమోబైల్ మార్కెట్ లోకి SUV వాహనాలను తీసుకురావడంలో Mahindra కంపెనీకి మించిన వారు లేరు అని కొందరి భావన. ఎందుకంటే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే వాహనాలు హుందాగా ఉండడంతో పాటు కఠినమైన రోడ్లపై కూడా సులభతరంగా వెళ్లే విధంగా డిజైన్ చేస్తారు. వీటికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ చాలామంది మహీంద్రా వాహనాలు కొనుగోలు చేయాలని అనుకొంటూ ఉంటారు. అందుకే ఎప్పుడూ కొత్త కారు రిలీజ్ అయినా వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ ఉంటాయి. అయితే మహీంద్రా నుంచి తాజాగా వచ్చిన ఓ కారు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉంది. సాధారణంగా మహేంద్ర వాహనాలు ధర ఎక్కువగా ఉంటాయని భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఈ మాడల్ మాత్రం రూ. 3.80 లక్షలకే అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ కారు ఏదో చూద్దాం..
2025 సంవత్సరంలో మహేంద్ర కంపెనీ లగ్జరీ కార్లను రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇదే సమయంలో దీర్ఘకాలంలో సామాన్యులకు ఉపయోగపడేలా వాహనాన్ని డిజైన్ చేసింది అదే Mahindra Bolero. గతంలో వచ్చిన బొలెరో గురించి చాలామందికి తెలిసిన విషయమే. ఎంతటి కఠిన రోడ్లు అయినా సులభంగా వెళ్లే బొలెరో వాహనాన్ని ఎంతోమంది ఆదరించారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ వాహనం కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ కారులో డ్రైవింగ్ చేస్తే ఎలాంటి అలసట ఉండదని అంటున్నారు. అంతేకాకుండా ఇంత తక్కువ ధరలో 40kmpl మైలేజ్ ఉండడం అందరికీ షాక్ ఇస్తున్న విషయం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రూ.3.80 లక్షలకు SUV అందుబాటులో ఉండడం ఎవరికి నమ్మశక్యం కావడం లేదు.
ఈ వెహికల్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది. అలాగే ఇందులో USB చార్జర్, విశాలమైన క్యాబిన్, నిటారుగా ఉండే సీడ్స్, ఆకట్టుకునే డాష్ బోర్డు లేఅవుట్ వంటివి ఉండడంతో డ్రైవింగ్ చేసేవారితో పాటు ఇందులో ప్రయాణించే వారికి అనుకూలమైన సౌకర్యాలు ఉంటాయి. అలాగే ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, EBD తో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి ఉన్నాయి. వెహికల్ ప్యానల్ బలమైన ఇనుముతో నిర్మాణం చేయడంతో ఇంపాక్ట్ ప్రొటెక్షన్ అందిస్తుంది. అధిక లోడు నువ్వు తట్టుకునే విధంగా దీనిని తయారు చేశారు. మెయింటెనెన్స్ తక్కువగా ఉండడంతో పాటు రీసేల్ కు కూడా మంచి ఆదరణ ఉండనుంది. సొంత అవసరాలతో పాటు వ్యాపార అవసరాలకు ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాదిలో అతి తక్కువ ధరలో లభించే వెహికల్ ఇదే కాబట్టి అన్నిటికంటే ఇదే హైలెట్గా నిలిచే అవకాశం ఉందని కొందరు ఆటోమోబైల్ నిపుణులు అంటున్నారు. పైకి లగ్జరీ కారులా కనిపించే ఈ కారు అతి తక్కువ ధరకు రావడంతో చాలామంది కారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.