Citriene basalt : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రంగాల వారికి ఈ బడ్జెట్ అనుకూలం అని భావిస్తుండగా..మరికొందరు మాత్రం తమకు నిరాశే ఎదురైందని అంటున్నారు. ఆటోమోబైల్ రంగానికి చెందిన వారు మాత్రం ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి ఆశాజనిత ప్రకటనలు లేవని పెదవి విరుస్తున్నారు. ఈసారి బడ్జెట్ లో ఆటోమోబైల్ రంగానికి చెందిన కొన్ని రకాల ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయని భావించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల జోరు కొనసాగతున్న తరుణంలో ఈవీలు ఉత్పత్తి చేసే కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చే ప్రకటనలు ఉంటాయని అనుకున్నారు. కానీ ఈ బడ్జెట్ లో కార్ల ఉత్పత్తుల విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే విద్యుత్ కార్లలో ఉపయోగించే బ్యాటరీలో ఉపయోగించే లిథియం, కాపర్ తో పాటు కోబాల్డ్ వంటి ఖనిజాలపై కస్టమ్స్ సుంకం మినహాయింపును ప్రకటించారు. దీంతో ఎలక్ట్రిక్ కార్లకు పరోక్షంగా ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ కార్లను ఉత్పత్తి చేసిన కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సిట్రియెన్ కంపెనీకి చెందిన బసాల్ట్ రెడీగా ఉంది. మరోవైపు హ్యుందాయ్ నుంచి కొన్ని ఈవీలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీటిలో సిట్రియెన్ బసాల్డ్ వచ్చే ఆగస్టులో రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ కారును ఇప్పటికే చాలా మంది బుకింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారు వివరాల్లోకి వెళితే..
ప్రముక కార్ల కంపెనీ సిట్రియెన్ నుంచి ఇప్పటికే భారత్ లో సీ3, సీ3 ఎయిర్ క్రాస్ కార్లు భారత మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. ఇవి వాటి పనితీరును బట్టి అత్యధికంగా సేల్స్ నమోదు చేసుకున్నాయి. అయితే చాలా కాలం తరువాత సిట్రియెన్ కంపెనీ కొత్తగా బసాల్ట్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. దీనిని ఆగస్టు 2024లో మార్కట్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్ యూవీ వేరియంట్ లో వస్తున్న బసాల్డ్.. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న మారుతి సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
సిట్రియెన్ బసాల్ట్ .. అంతకు ముందు వచ్చిన సీ3 ఎయిర్ క్రాస్ మోడల్ ను పోలీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇందులో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఈ ఇంజిన్ పై 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. బసాల్ట్ కు సంబంధించి కొన్ని ఫీచర్ల గురించి చర్చ సాగుతోంది. ఇందులో 10.2 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉండనుంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ తో పాటు లేటేస్ట్ టెక్నాలజీ ఫీచర్లను అమర్చనున్నారు. వీటితో పాటు డిప్పింగ్ రూప్ లైన్, ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్ ఉండనున్నాయి.
సిట్రియెన్ కు సంబంధించి బుకింగ్ లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రూ.25,000 నుంచి రూ.51,000 టోకెన్ తో దీనిని బుక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్ యూవీ కావాలని కోరుకుంటున్న వారు బసాల్ట్ ను బుక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కట్లో ఉన్న మొదటి ICEకూపే ఎస్ యూవీలలో ఇది ఒకటిగా నిలవ నుందని అంటున్నారు.
హ్యుందాయ్ నుంచి కొన్ని ఈవీలు మార్కెట్లోకి తీసుకురావాడనికి సిద్ధంగా ఉంది. తన లగ్జరీ బ్రాండ్ జెనెసిస్ ను వినియోగదారులకు పరిచయం చేయనుంది. ఈ కారు GV80, GV80 ఎస్ యూవీ ఆధారంగా డిజైన్ చేయబడ్డాయి. ఈ కారు మార్కెట్లోకి వస్తే మెర్సిడేస్ బెంజ్ , బీఎం డబ్ల్యూకు గట్టి పోటీ ఇవ్వనుందని అంటున్నారు.