ఫోన్ చేస్తే 2 గంటల్లో గ్యాస్ సిలిండర్.. ఎలా అంటే..?

మనలో చాలామంది గ్యాస్ సిలిండర్ అయిపోవడం వల్ల చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడుతుంటారు. గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసినా కొన్నిసార్లు వెంటనే సిలిండర్ ను పొందడం సాధ్యం కాదు. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1800 22 4344 నంబర్ కు కాల్ చేయడం ద్వారా 5 కేజీల గ్యాస్ సిలిండర్ ను సులభంగా పొందవచ్చు. బుకింగ్ చేసిన 2 గంటల్లో ఈ గ్యాస్ సిలిండర్ […]

Written By: Navya, Updated On : April 25, 2021 8:10 pm
Follow us on

మనలో చాలామంది గ్యాస్ సిలిండర్ అయిపోవడం వల్ల చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడుతుంటారు. గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసినా కొన్నిసార్లు వెంటనే సిలిండర్ ను పొందడం సాధ్యం కాదు. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1800 22 4344 నంబర్ కు కాల్ చేయడం ద్వారా 5 కేజీల గ్యాస్ సిలిండర్ ను సులభంగా పొందవచ్చు.

బుకింగ్ చేసిన 2 గంటల్లో ఈ గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ అవుతుంది. ఇంట్లో సిలిండర్ అయిపోయిన వాళ్లకు ఈ సేవల వల్ల భారీగా ప్రయోజనం చేకూరనుంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం 25 రూపాయలు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా ఈ గ్యాస్ సిలిండర్లను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ గ్యాస్ సిలిండర్ల వల్ల కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో మాత్రమే ఈ హోమ్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇతర పట్టణాలు, గ్రామాల్లో సైతం ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కేవలం ఐడీ ప్రూఫ్ చూపించడం ద్వారా 5 కేజీల గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు. ఎవరైతే హోమ్ డెలివరీని పొందలేరో వారు సమీపంలోని కిరాణ స్టోర్లు, సూపర్ మార్కెట్ల దగ్గరకు వెళ్లి గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయవచ్చు.

సమీపంలోని గ్యాస్ డీలర్ ను సంప్రదించి 5 కేజీల గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ కావాల్సిన వాళ్లకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.