Telugu News » Business » Low interest for deposit in bank high interest for taking loan why
Low Interest For Deposit In Bank: బ్యాంకులో డిపాజట్ కు తక్కువ వడ్డీ.. రుణం తీసుకుంటే ఎక్కువ వడ్డీ.. ఎందుకు?
ప్రస్తుత కాలంలో డబ్బే ప్రపంచం అన్నట్లు గా ఉంది. చేతిలో నగదు లేకపోతే ఏ పని ముందుకు సాగదు. అందుకే చాలా మంది ధనం సంపాదించేందుకు ఆరాటపడుతూ ఉంటారు. అయితే కొందరు కాస్త ఎక్కువ కష్టపడి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. భవిష్యత్ అవసరాల కోసం మిగులు డబ్బును ఉంచాలని అనుకుంటారు.
Written By:
Srinivas, Updated On : November 4, 2024 12:17 pm
Follow us on
Low Interest For Deposit In Bank: ప్రస్తుత కాలంలో డబ్బే ప్రపంచం అన్నట్లు గా ఉంది. చేతిలో నగదు లేకపోతే ఏ పని ముందుకు సాగదు. అందుకే చాలా మంది ధనం సంపాదించేందుకు ఆరాటపడుతూ ఉంటారు. అయితే కొందరు కాస్త ఎక్కువ కష్టపడి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. భవిష్యత్ అవసరాల కోసం మిగులు డబ్బును ఉంచాలని అనుకుంటారు. కానీ ఈ డబ్బును ఇంట్లో ఉంచడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా దొంగల భయం ఎక్కువ. కొందరైతే తమ డబ్బును ఇతరులకు అధిక వడ్డీనికి ఇస్తూంటారు. మరికొందరు మాత్రం బ్యాంకులో Fixed Deposit చేస్తారు. అయితే బ్యాంకులో డబ్బు ఫిక్స్ చేయడం వల్ల తక్కవ వడ్డీ వస్తుంది. అదే ఇతరులకు ఇవ్వడం వల్ల ఎక్కువ వడ్డీని పొందవచ్చు. మరి ఇలాంటి సమయంలో డబ్బును బ్యాంకులో ఫిక్స్ డ్ చేయవచ్చా? అదీ కాకుండా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది.. కానీ ఫిక్స్ డ్ చేస్తే తక్కువ వడ్డీ ఇస్తారు? ఇలా ఎందుకు చేస్తారంటే?
డబ్బును వడ్డీలకు ఇస్తూ కొందరు వ్యాపారం చేస్తుంటారు. వ్యక్తుల అవరాలను తీర్చడానికి నిర్ణయించిన వడ్డీకి నగదును అందిస్తుంటారు. అయితే కొందరు వ్యక్తుల అత్యవసరాలను గమనించి ఎక్కువ వడ్డీని వసూలు చేస్తుంటారు. దీంతో చాలా మంది దీనిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి అన్ని పరిస్థితుల్లో ఒకేలా ఉంటాడని అనుకోలేం. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బు కట్టలేని స్థితికి రావొచ్చు. దీంతో కొందరు నగదును కట్టలేక ఐపీని విధిస్తారు. దీంతో డబ్బు ఇచ్చిన వ్యక్తి తీవ్రంగా నష్టపోతుంటారు. ఈ పరిస్థితి ఎదురుకొకపోతే మాత్రం అప్పు ఇచ్చిన వ్యక్తి అధికంగా లాభపడుతాడు.
ఇలాంటి భయం ఉన్నవాళ్లు కొందరు బ్యాంకులో డబ్బును దాచుకుంటారు. అయితే బ్యాంకులో డబ్బు Fix చేయడం వల్ల తక్కువ వడ్డీ వస్తుంది. మినిమం 6 శాతం నుంచి 7.5 శాతం వరకే వడ్డీ ఇస్తారు. ఇది బయటి వ్యక్తులకు ఇచ్చేదాని కంటే భారీగా తక్కువ. అయితే బ్యాంకులో డబ్బు ఫిక్స్ చేయడం వల్ల సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు డబ్బు తీసుకునే వీలు ఉంటుంది. దొంగల భయం నుంచి తప్పించుకోవచ్చు. ఒక్కోసారి ఈ వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇదే సమయంలో బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఇంతకంటే ఎక్కువ వడ్డీ.. డిపాజిట్ చేస్తే తక్కువ ఎందుకు వేస్తారు అనే సందేహంలో చాలా మంది ఉంటారు. అయితే బ్యాంకులో డిపాజిట్లు చేసేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. రుణం తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. డిపాజిట్లపై మాత్రమే కాకుండా ఇతర మార్గాల ద్వారా డబ్బును సేకరించి రుణం అందిస్తుంటారు. దీంతో రుణం ఇచ్చే డబ్బుపై ఎక్కువ వడ్డీ వేస్తారు. ఇక డిపాజిట్ చేసిన వ్యక్తులకు ఎప్పుడంటే అప్పుడు నగదు అందిస్తుంటారు. దీంతో వారికి వడ్డీ తక్కవగా ఇస్తారు. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్లతో పాటు మరికొన్ని ప్రత్యేక పథకాల ద్వారా వడ్డీ రేటు వేరే విధంగా ఉంటుంది.