LinkedIn report : ఉద్యోగులు ఎక్కువగా లైక్ చేసే కంపెనీలు ఇవే.. లింక్డ్ ఇన్ నివేదికలో షాకింగ్ విషయాలు

లింక్డ్ సంస్థ బయటపెట్టిన నివేదికలోని టాప్ 25 కంపెనీల్లో 9 సంస్థలు ఆర్థిక సేవలు నిర్వహించేవే ఉన్నాయి. ఇందులో మెక్వారీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్ చేస్ అండ్ కో ఉన్నాయి.

Written By: NARESH, Updated On : April 17, 2024 6:10 pm

tcs

Follow us on

LinkedIn report : చాలా మందికి ఉద్యోగం చేయడం అంటే ఇష్టం. అదీ పెద్ద కంపెనీల్లో జాబ్ చేయడం అంటే హుందాగా ఫీలవుతారు. అయితే కొన్ని కంపెనీలు పేరుకు కార్పొరేట్ అయి ఉండి, భారీ జీతం, అనువైన సౌకర్యాలు ఉన్నా.. మనశ్శాంతి ఉండదు. ఏదో తెలియని బాధ ఉంటుంది. ఈ నేపథ్యంలో నెట్ వర్కింగ్ ప్లాట్ ఫాం ‘లింక్డ్ ఇన్’ తాజాగా జరిపిన అధ్యయనాల్లో కొన్ని కంపెనీలు ది బెస్ట్ గా నిలిచాయి. ఇందులో పనిచేయానికి ఉద్యోగులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారని తెలిపింది. ఇందులో ఎక్కువగా ఆర్థిక సేవలు నిర్వహించే కంపెనీలే ఉండడం విశేషం. మరి ఆ వివరాల్లోకి వెళితే..

లింక్డ్ సంస్థ ‘2024 టాప్ కంపెనీస్’ నివేదికను ఏప్రిల్ 16న బయట పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగులు పనిచేయడానికి అనువైన కంపెనీల్లో మొదటి స్థానంలో టాటా కన్సల్టెన్నీ సర్వీసెస్ (TCS)మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో పనిచేయడానికి ఉద్యోగులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు పేర్కొంది. ఆ తరువాత యాక్సంచర్, కాగ్నిజెండ్ రెండు, మూడు స్థానాలు సంపాదించుకున్నాయి. ఇక ఇందులో అగ్రగామిగా 25 సంస్థలు, మధ్యస్థాయిగా 15 ఉన్నాయి.

లింక్డ్ సంస్థ బయటపెట్టిన నివేదికలోని టాప్ 25 కంపెనీల్లో 9 సంస్థలు ఆర్థిక సేవలు నిర్వహించేవే ఉన్నాయి. ఇందులో మెక్వారీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్ చేస్ అండ్ కో ఉన్నాయి. వీటితో పాటు ఫ్యాషన్, బ్యూటీ, రిటైలర్ సంస్థ నైకా, పాంటసీ స్పోర్ట్స్ ఫ్లాఫాం, డ్రీమ్ 11 కూడా ఉన్నాయి. సాప్ట్ వేర్ యూజ్ ఏ సర్వీస్, ప్లాట్ ఫాం లెంట్రా మధ్య స్థాయి కంపెనీ జాబితాలో ఉంది.

చాలా కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కోరుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సేవల రంగంలోని కంపెనీలు ఇన్వెస్టర్స్ రిలేషన్స్, క్యాపిటల్ మార్కెట్స్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ వంటి వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక టెక్ కంపెనీలు ఏఐ నైపుణ్యాల కోసం అన్వేసిస్తున్నాయి. డేటా స్టోరేజ్ టెక్నాలజీ, సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ లైఫ్ సైకిల్ రంగంలోని వారిని నియమించుకుంటున్నాయి.