Lilly Flower: ప్రస్తుత కాలంలో రైతులకు వ్యవసాయంలో చాలా సందర్భాల్లో లాభాల కంటే నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి. కొంతమంది రైతులు వ్యవసాయం వల్ల ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. డెకరేషన్ పువ్వులకు డిమాండ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండగా పూల వ్యవసాయం చేసే రైతులు లిల్లీ సాగు చేయడం ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
డెకరేషన్ పువ్వు అయిన లిల్లీ వేర్వేరు రంగుల్లో లభించడంతో పాటు ఈ పువ్వులను సాగు చేయడం ద్వారా మంచి లాభాలను పొందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పూల సాగు జరుగుతోంది. నర్సరీల నుంచి తీసుకున్న మొక్కల ద్వారా ఉత్పత్తి అయ్యే దుంపలను కుండీలలలో నాటి రైతులు పూలను పొందవచ్చు. లిల్లీల సాగుకు కొండ రాష్ట్రాలలోని వాతావరణం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: నెలకు రూ.1500తో రూ.35 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?
మైదాన ప్రాంతాలలో పాలీ హౌస్ ను నిర్మించుకొని మాత్రం లిల్లీ పూలను పెంచాల్సి ఉంటుంది. 2.5 కిలోల గడ్డి, 5 కిలోల బొగ్గు బూడిద, 2.5 కిలోల కోకోపీట్, 2.5 కిలోల వానపాముల ఎరువును వేసి లిల్లీస్ ను సాగు చేస్తే మంచిది. దుంప అభివృద్ధి చెందడానికి 90 రోజుల సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి. బిందు సేద్యం చేయడం ద్వారా లిల్లీల సాగు చేయడం సాధ్యమవుతుంది.
రైతులు అవసరమైతే దుంపలను అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. లేదా పూలను నేరుగా విక్రయించడం ద్వారా కూడా డబ్బులను సంపాదించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. కొన్ని కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకుని లిల్లీ సాగు చేయిస్తుండటం గమనార్హం.
Also Read: ఆదాయపు పన్నును సులువుగా ఆదా చేయడానికి పాటించాల్సిన పది చిట్కాలివే!