
దేశీయ బీమా దిగ్గజ కంపెనీలలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల స్కీమ్స్ ను అందిస్తూ టర్మ్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్ తో పాటు చిల్డ్రన్స్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్ ను ఖాతాదారులకు అందిస్తోంది. కేంద్రం ద్వారా ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీలలో ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పాలసీ ఒకటని చెప్పవచ్చు. కస్టమర్ల కోసం ఎల్‌ఐసీ తెచ్చిన ఈ పాలసీ 2023 సంవత్సరం మార్చి నెల 31 వరకు అందుబాటులో ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ కు ప్రయోజనం చేకూర్చే ఈ పాలసీలో వెంటనే చేరితే మంచిది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.66 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా ఈ స్కీమ్ టెన్యూర్ 10 సంవత్సరాలుగా ఉంది. 60 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ప్రధానమంత్రి వయ వందన యోజన పాలసీని తీసుకుని ఈ పాలసీ యొక్క ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్ ద్వారా నెలకు గరిష్టంగా 9,250 రూపాయల పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు 9,250 రూపాయల పెన్షన్ లభిస్తుంది. స్కీమ్‌లో చేరిన వ్యక్తి మధ్యలోనే మరణిస్తే నామినీ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ తీసుకున్న పదేళ్ల తర్వాత కూడా జీవించి ఉంటే కట్టిన వారికే డబ్బులు వెనక్కు వస్తాయి.
ఈ స్కీమ్ లో 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఏడాది చొప్పున పెన్షన్ పొందాలనే ఆప్షన్ ను ఎంచుకుంటే ఏకంగా 23 వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది.