
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారుల కొరకు ఎన్నో పాలసీలను అందుబాటులోకి తెస్తోంది. చిల్ట్రన్స్ ప్లాన్స్ దగ్గరి నుంచి యాన్యుటీ ప్లాన్స్ వరకు ఎల్‌ఐసీ పాలసీదారులకు వేర్వేరు పాలసీలను ఆఫర్ చేస్తుండటం గమనార్హం. ఈ పాలసీలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ పాలసీదారులకు అందిస్తున్న పాలసీలలో జీవన్ లక్ష్య పాలసీ కూడా ఒకటి.
జీవన్ లక్ష్య పాలసీ తీసుకోవడం వల్ల ఎక్కువమొత్తం రాబడిని పొందే అవకాశం ఉంటుంది. కుటుంబాలకు ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక భద్రత కల్పించడంలో ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. పాలసీ టర్మ్ 13 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు కాగా 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. నచ్చిన టర్మ్ ఎంచుకోవడంతో పాటు టర్మ్ ప్రాతిపదికన మీకు చెల్లించే ప్రీమియం డబ్బులు కూడా ఆధారపడి ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి.
18 ఏళ్ల వయసులో ఉన్నవాళ్లు 10 లక్షల రూపాయల బీమా కోసం పాలసీని 20 సంవత్సరాల టర్మ్ తో తీసుకుంటే రోజుకు 150 రూపాయల వరకు ఆదా చేయాల్సి ఉంటుంది. ఈ పాలసీ కోసం నెలకు 4500 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉండగా రోజుకు రూ.150 ఆదా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో ఏకంగా దాదాపు రూ.20 లక్షలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మధ్య వయస్కులకు ఈ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు.