రూ.74 పొదుపుతో రూ.10 లక్షలు పొందే ఛాన్స్.. ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్..!

దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎన్నో రకాల పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ ప్రీమియం చెల్లించి ఆకర్షిణీయమైన రాబడి పొందాలని భావించే వాళ్లకు ఎల్‌ఐసీ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీలలో న్యూ జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒకటి. కనీసం లక్ష రూపాయల మొత్తానికి ఈ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. రక్షణతో పాటు రాబడి పొందాలనుకునే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు. […]

Written By: Navya, Updated On : July 14, 2021 6:03 pm
Follow us on

దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎన్నో రకాల పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ ప్రీమియం చెల్లించి ఆకర్షిణీయమైన రాబడి పొందాలని భావించే వాళ్లకు ఎల్‌ఐసీ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీలలో న్యూ జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒకటి. కనీసం లక్ష రూపాయల మొత్తానికి ఈ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. రక్షణతో పాటు రాబడి పొందాలనుకునే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు.

18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు న్యూ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కనీసం లక్ష రూపాయల మొత్తానికి ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉండగా ఈ పాలసీకి గరిష్ట పరిమితి లేకపోవడం గమనార్హం. పాలసీ టర్మ్ 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉండగా ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.

నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ప్రీమియంను చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత అవసరమైతే లోన్ కూడా పొందే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల వయస్సులో ఉన్నవాళ్లు 21 ఏళ్ల టర్మ్‌తో రూ.5 లక్షల మొత్తానికి పాలసీని తీసుకుంటే మెచ్యూరిటీ సమయంలో 10 లక్షల రూపాయలకు పైగా పొందే అవకాశం ఉంటుంది.

నెలకు 2,220 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉండగా పాలసీ ప్రీమియంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. మెచ్యూరిటీ డబ్బులపై పన్ను పొందే అవకాశం అయితే ఉండదు.