
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా ఎక్కువ ప్రీమియం చెల్లించే సామర్థ్యం లేని వాళ్ల కొరకు తక్కువ ప్రీమియం పాలసీలను కూడా అందుబాటులో ఉంచింది. మైక్రో బచన్ ఇన్సూరెన్స్ పాలసీ పేరుతో ఎల్‌ఐసీ అందిస్తున్న ఈ పాలసీ తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈపాలసీ తీసుకుంటారో వాళ్లు సేవింగ్స్, ప్రొటెక్షన్ పొందే అవకాశం ఉంటుంది.
ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ల కుటుంబ సభ్యులు ఆర్థిక భద్రత పొందే అవకాశాలు అయితే ఉంటాయి. పాలసీదారుడు మెచ్యూరిటీ సమయం వరకు జీవించి ఉంటే పాలసీదారుడు ఆ డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. మూడేళ్లు ప్రీమియం కట్టిన తర్వాత లోన్ ఫెసిలిటీ కూడా పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ టర్మ్ 10 నుంచి 15 ఏళ్లు ఉండగా రోజుకు 28 రూపాయల చొప్పున పొదుపు చేస్తూ 10,300 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ప్రీమియం చెల్లించే అవకాశాలు ఉంటాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఎల్‌ఐసీ పాలసీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మైక్రో బచన్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు మరికొన్ని ఇన్సూరెన్స్ పాలసీలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. ఎల్‌ఐసీ ఏజెంట్ల ద్వారా కూడా ఈ పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.