
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ అమలు చేస్తున్న స్కీమ్ లలో మైక్రో బచత్ ప్లాన్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ తక్కువ ఆదాయం కలిగిన వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రజల్లో నమ్మకం ఉన్న ఈ కంపెనీ ప్రైవేట్ కంపెనీలను మించి ఫలితాలను రాబడుతోంది.
Also Read: కొత్త కారు కొనేవాళ్లకు శుభవార్త.. రూ.95 వేలు తగ్గింపు..?
నాన్ లింక్డ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ అయిన ఈ పాలసీలో పాలసీ దారుడు జీవించి ఉంటే పాలసీదారుడే డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పాలసీదారుడు మరణిస్తే మాత్రం నామినీ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందడానికి కూడా అర్హులు. ఈ పాలసీపై లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పాలసీ తీసుకున్న వాళ్లు ఏ విధంగా నష్టపోరు.
కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ టర్మ్ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలుగా ఉంటుంది. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు. ఈ పాలసీలో చేరిన వాళ్లు సంవత్సరానికి 10,320 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 2,00,000 రూపాయలు పొందవచ్చు.
Also Read: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. ఆ గడువు పొడిగింపు..?
సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ వివరాలను తెలుసుకోవచ్చు. ఎక్కువ మొత్తం ప్రీమియం చెల్లిస్తే ఎక్కువ మొత్తం మెచ్యూరిటీ సమయంలో పొందే అవకాశం ఉంటుంది.