LIC : ఎల్ఐసి జీవన్ శిరోమణి స్కీమ్ ఒక బీమా పాలసీగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో మీకు భరోసా ఇచ్చే మంచి పెట్టుబడి ప్లాన్ గా కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎల్ఐసి మధ్యతరగతి మరియు పై తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాను అందుబాటులోకి తెచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ స్కీం లో బీమా కవరేజ్ తో మనీ బ్యాక్ లాభాలు కూడా పొందే అవకాశం ఉంది. అవసరమైనప్పుడు రుణం కూడా తీసుకునే సదుపాయం ఉంది. ఈ పథకంలో డబ్బులు చాలా సురక్షితంగా ఉంటాయి. అలాగే మీకు అవసరమా వచ్చిన సమయంలో డబ్బు మొత్తాన్ని తిరిగి తీసుకునే అవకాశం కూడా ఈ స్కీమ్ లో ఉంది. కేవలం నాలుగు సంవత్సరాలు ఈ స్కీమ్లో మీరు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
Also Read : ఆర్డర్ చేసిన 90నిమిషాల్లోనే మీ ఇంటికి బీఎస్ఎన్ఎల్ 5జి సిమ్.. ప్రాసెస్ ఇదే
ఎల్ఐసి అందిస్తున్న జీవన్ శిరోమణి స్కీం హై అండ్ పాలసీ కావడంతో దీనికి ప్రీమియం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒకవేళ మీరు ఒక కోటి రూపాయలు గరిష్ట మొత్తంగా పొందాలనుకుంటుంటే మీరు ప్రతి నెల రూ.94,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మీరు నెలవారి, మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి మీకు సౌకర్యంగా ఉన్న విధంగా చెల్లించే అవకాశం ఉంది. ఈ స్కీంకు కనీసం 18 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు అర్హులు. నీ పాలసీని బట్టి కాలానికి అనుగుణంగా గరిష్ట వయస్సు పరిమితి కూడా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే 14 సంవత్సరాల పాలసీకి గరిష్ట వయస్సు 55 ఏళ్లు ఉంటుంది.
అలాగే 16 సంవత్సరాల పాలసీకి 51 ఏళ్లు గా నిర్ణయించబడింది. 18 సంవత్సరాల పాలసీకి మీకు 48 ఏళ్ళు. ఇక 20 సంవత్సరాల పాలసీకి 45 ఏళ్లు నిర్ణయించారు. పాలసీ మధ్యలో కూడా డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పాలసీ ప్రారంభించిన తర్వాత మధ్యలో కొంత డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే 14 ఏళ్ల పాలసీ తీసుకుంటే పదవ లేదా 12వ సంవత్సరంలో 30% వరకు డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఒకవేళ మీరు 16 ఏళ్ల పాలసీ తీసుకున్నట్లయితే 12వ లేదా 14వ సంవత్సరంలో 35% డబ్బు తిరిగి వస్తుంది. అలాగే 18 ఏళ్ల పాలసీలో 14వ లేదా 16వ సంవత్సరంలో 40% డబ్బు అందుతుంది. 20 ఏళ్ల పాలసీలో మీకు 16వ లేదా 18వ సంవత్సరంలో 45 శాతం డబ్బు మీకు తిరిగి వస్తుంది. మిగిలిన డబ్బు మొత్తం బోనస్తో సహా పాలసీ పూర్తి అయిన తర్వాత మీకు అందుతుంది.
Also Read : SIP ఇన్వెస్ట్మెంట్ చేసి ఆపేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..