
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ అందిస్తున్న పాలసీలలో జీవన్ ప్రగతి పాలసీ కూడా ఒకటి కావడం గమనార్హం. ఒక వ్యక్తి రోజుకు 200 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత ఏకంగా 28 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత నెలకు 15,000 రూపాయలు పెన్షన్ రూపంలో సులువుగా పొందవచ్చు.
పెట్టుబడిపై సురక్షితమైన రాబడిని అందించే స్కీమ్స్ లో జీవన్ ప్రగతి స్కీమ్ ఒకటని చెప్పవచ్చు. జీవన్ ప్రగతి స్కీమ్ ద్వారా ఎల్ఐసీ పెట్టుబడిదారులకు భవిష్యత్తును భద్రపరచుకునే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. జీవన్ ప్రగతి ప్లాన్ ద్వారా ఐదు సంవత్సరాల తర్వాత పాలసీలో రిస్క్ కవర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మొదటి ఐదేళ్ల మొత్తం అలాగే ఉంటుందని సమాచారం.
6 నుండి 10 సంవత్సరాల వరకు బీమా మొత్తం 25 శాతం నుంచి 125 శాతం వరకు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. 11 నుంచి 15 సంవత్సరాల వరకు బీమా మొత్తం 150 శాతం వరకు పెరుగుతుంది. 20 సంవత్సరాల వరకు డబ్బు తీసుకోకపోతే బీమా మొత్తం 200 శాతానికి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. 12 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు.
పాలసీ కనీస వ్యవధి 12 సంవత్సరాలుగా గరిష్టంగా 20 సంవత్సరాలుగా ఉంది. కనీస కవర్ మొత్తం లక్షన్నర రూపాయలుగా ఉంది. సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ పాలసీ మెచ్యూరిటీ గరిష్ట వయస్సు 65 సంవత్సరాలుగా ఉంది.