Lexus ES 500e features: పురాణాలలో మనం హంస వాహనం గురించి చదివే ఉంటాం. సినిమాలలో చూసే ఉంటాం. ఆ వాహనం ఎన్నో అద్భుతాలమయం. అలాంటి వాహనమే ఇది. రోడ్డుమీద డ్రైవ్ చేస్తుంటే అద్భుతమైన అనుభూతి అందిస్తుంది. ఆకట్టుకునే ఫీచర్లతో మాయ ప్రపంచాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. ఇంతకీ ఈ మోడల్ ఏంటి.. ఇందులో ఉన్న ఫీచర్లేంటి.. ధర ఏ స్థాయిలో లభిస్తుంది.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
ఇండియన్ మార్కెట్లో లెక్సస్ కంపెనీ సరికొత్త మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి లెక్సస్ ఈఎస్ 500 ఈ అని పేరు పెట్టింది. దీని ప్రారంభ ధర 89.99 లక్షలు. ఇండియన్ మార్కెట్ కోసం లెక్సెస్ కంపెనీ దీనిని ఫుల్ ఎలక్ట్రిక్ వాహనం మాదిరిగా రూపొందించింది. త్వరలోనే దీని హైబ్రిడ్ వెర్షన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
లెక్సస్ ఈఎస్ 500 ఈ కారు లో బ్యాటరీ ప్యాక్ 74.69 కే డబ్ల్యూహెచ్ తో వస్తుంది. ఈ బ్యాటరీ దాదాపు 338 బిహెచ్పి శక్తిని రిలీజ్ చేస్తుంది. ఇందులో మొత్తంగా డ్యూయల్ మోటార్ సెట్ అప్ ఉంది. జస్ట్ 5.7 సెకండ్ లోనే 0 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ కు స్పీడ్ వెళ్తుంది. ఫుల్ చార్జింగ్ మీద పై 580 కిలోమీటర్ల రేంజ్ అందుకుంటుంది.
ఇందులో డిజైన్ సరికొత్తగా ఉంది.. ఇందులో ఈఎస్ డ్యూయల్ మాడ్యూల్ ఉంది. ఎల్ ఆకారపు ఎల్ఈడి డిఆర్ఎల్ అప్డేటెడ్ స్టైలింగ్ లాంగ్వేజ్ ను అనుసరిస్తూ ఉంటుంది.. హెడ్ లాంప్ లు ఈ మోడల్ లో ప్రత్యేక ఆకర్షణ. అవి బంపర్ కింది భాగంలో ఉన్నాయి. 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. సెమీ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ సరికొత్తగా కనిపిస్తున్నాయి. కారు వెనుక భాగంలో లెక్సస్ మోడల్ ను ప్రతిబింబిస్తూ కనెక్టెడ్ ఎల్ఈడి లైట్ బార్ కనిపిస్తోంది.
ఇందులో ఉన్న క్యాబిన్లో 12.3 అంగుళాల ఫుడ్ లెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంది. వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే.. ఆండ్రాయిడ్ ఆటో ను సపోర్ట్ చేసే 14 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మాదిరిగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇందులో లెవెల్ టు ఏ డి ఏ ఎస్, ఎలక్ట్రిక్సన్ సన్ రూఫ్, 17 స్పీకర్ల సామర్ధ్యమున్న మార్క్ లెవెన్సన్ సౌండ్ సిస్టం.. డిజిటల్ ఐ వి ఆర్ ఎం.. సాఫ్ట్ క్లోజ్ డోర్లు.. డ్యూయల్ వైర్లెస్ చార్జింగ్ ప్యాడ్లు.. ఇక ఎన్నో సదుపాయాలు ఇందులో ఉన్నాయి..
మిడిల్ క్లాస్ వాళ్లు ఈ కారును కొనుగోలు చేయడం కష్టం. ఎలైట్ పీపుల్ ను లక్ష్యంగా చేసుకొని ఈ మోడల్ రూపొందించారు. అందువల్లే దీనిని సామాన్యులు చాలా కష్టం. టెస్లా కంపెనీ రూపొందించిన మోడల్ మాదిరిగానే ఈ కారు కూడా కనిపిస్తోంది. అయితే ఇది ప్రస్తుతానికి గ్రే కలర్లో మాత్రమే అందుబాటులో ఉందని.. వచ్చే రోజుల్లో మరిన్ని వేరియంట్లు మార్కెట్ లోకి వస్తాయని లెక్సస్ కంపెనీ చెబుతోంది.