రూ.5000 పెట్టుబడితో లక్షల రూపాయల లాభం.. ఏం బిజినెస్ అంటే..?

దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. దేశంలో చాలామంది డిగ్రీ, పీజీ చదివి అర్హతకు తగిన ఉద్యోగం లభించకపోవడం వల్ల చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. చాలామంది నిరుద్యోగులకు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా ఎక్కువ మొత్తం పెట్టుబడి అవసరం అని వెనుకడుగు వేస్తున్నారు. అయితే తక్కువ పెట్టుబడితోనే లక్షల రూపాయల లాభం అందించే బిజినెస్ లు ఉన్నాయి. అలాంటి బిజినెస్ లలో పుట్టగొడుగుల […]

Written By: Navya, Updated On : October 24, 2020 8:48 am
Follow us on


దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. దేశంలో చాలామంది డిగ్రీ, పీజీ చదివి అర్హతకు తగిన ఉద్యోగం లభించకపోవడం వల్ల చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. చాలామంది నిరుద్యోగులకు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా ఎక్కువ మొత్తం పెట్టుబడి అవసరం అని వెనుకడుగు వేస్తున్నారు.

అయితే తక్కువ పెట్టుబడితోనే లక్షల రూపాయల లాభం అందించే బిజినెస్ లు ఉన్నాయి. అలాంటి బిజినెస్ లలో పుట్టగొడుగుల పెంపకం ఒకటి. తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ ద్వారా అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవచ్చు. 5000 రూపాయలు ఉన్నా సులువుగా ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయవచ్చు. కంపొసైట్‌ను వినియోగించి సులువుగా పుట్టుగొడుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు.

మార్కెట్ లో పుట్టగొడుగులు సులువుగా అమ్ముడవుతున్నాయి. మూడు నుంచి నాలుగు వారాలలోనే పుట్టగొడుగులు పుట్టగొడుగులు వస్తాయి తక్కువ సమయంలోనే లాభాలను పొందవచ్చు. అయితే పుట్టగొడుగుల పెంపకం చేపట్టే ముందు వాటి పెంపకం గురించి సరైన అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రస్తుతం మార్కెట్ లో కిలో పుట్టగొడుగులు 100 రూపాయలకు పైగా పలుకుతున్నాయి.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో పుట్టగొడుగులు ఎంత గానో సహాయపడతాయి. ఆన్ లైన్ లో పుట్టగొడుగులను ఎక్కువ మొత్తానికి కూడా విక్రయించవచ్చు. పెట్టుబడి ఎక్కువమొత్తం ఇన్వెస్ట్ చేయలేని వారికి ఈ బిజినెస్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.