KTM: కంపెనీ కొన్ని ముఖ్యమైన సరఫరాదారులకు బకాయిలు చెల్లించలేకపోయింది. దీని కారణంగా అవసరమైన విడిభాగాల సరఫరా నిలిచిపోయింది. ఈ విడిభాగాలు లేకుండా బైక్‌లను తయారు చేయడం అసాధ్యం. దీంతో కేటీఎం ఉత్పత్తిని నిలిపివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Also Read: ఎలాన్ మస్క్.. మూడు దేశాల నుంచి ప్రపంచ కుబేరుడి ఒడిలోకి..
ఉత్పత్తి ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుంది?
కేటీఎం తెలిపిన ప్రకారం.. జూలై 2025 నుంచి పరిస్థితులు చక్కబడిన తర్వాత ఉత్పత్తిని తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. కంపెనీ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోంది. గతంలో కేటీఎం భారీ నష్టాలను చవిచూసింది. ఒక సమయంలో కంపెనీ అమ్మకానికి లేదా మూసివేతకు కూడా చేరుకుంది. ఇప్పుడు కేటీఎం తన గుర్తింపును తిరిగి బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తోంది.
భారత్‌లో కేటీఎం జోరు
ఒకవైపు ఆస్ట్రియాలో పరిస్థితులు బాగాలేకపోతే మరోవైపు భారతదేశంలో కేటీఎం దూసుకుపోతోంది. ఇటీవల కంపెనీ భారతదేశంలో కొత్త కేటీఎం 390 Enduroను విడుదల చేసింది. ఇది అడ్వెంచర్, ఆఫ్-రోడింగ్ ప్రేమికుల్లో బాగా పాపులారిటీ పొందుతోంది. భారతదేశంలో స్థానిక ఉత్పత్తి, స్టాక్ కారణంగా బైక్‌ల లభ్యత కొనసాగుతుంది. భవిష్యత్తులో పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం కొన్ని కొత్త మోడళ్ల విడుదల ఆలస్యం కావచ్చు.