క్రెడిట్ బీ మార్కెట్ లోకి కొత్త కార్డును అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డు కూడా క్రెడిట్ కార్డ్ లాంటి కార్డ్ కావడం గమనార్హం. ఈ కార్డు వర్చువల్ క్రెడిట్ కార్డ్ కాగా ఈ కార్డ్ ద్వారా సులభంగా ఆన్ లైన్ లావాదేవీలు చేసే అవకాశం అయితే ఉంటుంది. కార్డ్ లిమిట్ 10వేల రూపాయలు కాగా సంవత్సరానికి 149 రూపాయలు మెయింటెన్స్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతాకు పంపిన డబ్బులకు 5 నుంచి 7 శాతం వడ్డీ పడుతుంది.
కార్డు ద్వారా ఉపయోగించుకునే డబ్బులను 45 రోజులలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో డబ్బులు చెల్లించకపోతే 100 రూపాయల చార్జీలతో పాటు రోజుకు 0.15 శాతం లేట్ పేమెంట్ ఫీజును చెల్లించాలి. కార్డును సక్రమంగా వినియోగిస్తే కార్డు లిమిట్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. కార్డును ఉపయోగించే విధానాన్ని బట్టి క్రెడిట్ లిమిట్ పెంపు ఆధారపడి ఉంటుంది.
సమయానికి డబ్బులు కట్టకపోతే భారీ మొత్తంలో ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాలి. క్రెడిట్ కార్డులు జారీ చేయడానికి గతంలో కఠిన నిబంధనలు అమలు కాగా ప్రస్తుతం ఫోన్ల ద్వారానే క్రెడిట్ కార్డు జారీ అవుతుండటం గమనార్హం. క్రెడిట్ కార్డులను సద్వినియోగం చేసుకుంటే రివార్డు పాయింట్లను పొందే అవకాశాలు ఉంటాయి.