దేశంలో భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని పొదుపు చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ ఉత్తమమని చెప్పవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఆలోచించే వాళ్లకు ఈ స్కీమ్ ఉత్తమమైన స్కీమ్ కాగా కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
10 సంవత్సరాల 4 నెలల మెచ్యూరిటీతో పోస్టాఫీస్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. 1988 సంవత్సరం నుంచి ఇండియా పోస్ట్ లో ఈ స్కీమ్ అమలవుతోంది. జాయింట్ అకౌంట్ లేదా వ్యక్తిగత అకౌంట్ ద్వారా ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 6.9 శాతం వడ్డీరేటు అమలవుతోంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు కనీసం 1000 రూపాయల డిపాజిట్ తో ఈ స్కీమ్ లో చేరవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర ఖాతాను ప్రత్యేక పరిస్థితుల్లో ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఖాతాదారుడి మరణం తర్వాత ఆ ఖాతాను నామినీ లేదా చట్టపరమైన వారసుడికి బదిలీ చేయడం జరుగుతుంది. జాయింట్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే అకౌంట్ ఇతర ఖాతాదారులకు బదిలీ చేయడం జరుగుతుంది. 30 నెలల లాక్ ఇన్ పీరియడ్ తో పోస్టాఫీస్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఆరు నెలల బ్లాక్ లలో అకౌంట్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డబ్బులను ఖాతాదారుడు విత్ డ్రా చేసుకుంటే ఖాతా కాలానికి వడ్డీతో పాటు ప్రధాన మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది.