https://oktelugu.com/

కొత్త కారు కొనేవాళ్లకు అదిరిపోయే శుభవార్త.. రూ.లక్షకు రూ.767 ఈఎంఐ!

కొత్త కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇండియా శుభవార్త చెప్పింది. కస్టమర్ల కొరకు కియా ఇండియా పలు బ్యాంకులతో జతకట్టి కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ఆకర్షణీయమైన స్కీమ్స్ ను అందిస్తుండటం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్‌లతో జతకట్టిన కియా మోటార్స్ కొత్తగా కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్ల కోసం ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. కస్టమైజ్డ్ ఫైనాన్స్ స్కీమ్స్ ద్వారా కొత్త కారును […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 3, 2021 / 08:42 AM IST
    Follow us on

    కొత్త కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇండియా శుభవార్త చెప్పింది. కస్టమర్ల కొరకు కియా ఇండియా పలు బ్యాంకులతో జతకట్టి కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ఆకర్షణీయమైన స్కీమ్స్ ను అందిస్తుండటం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్‌లతో జతకట్టిన కియా మోటార్స్ కొత్తగా కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్ల కోసం ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది.

    కస్టమైజ్డ్ ఫైనాన్స్ స్కీమ్స్ ద్వారా కొత్త కారును కొనుగోలు చేసేవాళ్లు సులువుగా రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది. కియా సెల్టోస్, కియా సొనెట్, కియా కార్నివాల్ కార్లను సులభ ఈఎంఐ స్కీమ్స్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. లక్ష రూపాయలకు 767 రూపాయలు ఈఎంఐ చెల్లించడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశాలు ఉంటాయి. తొలి ఆరు నెలలు మాత్రమే ఈ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది.

    ఆ తర్వాత రెగ్యులర్ ఈఎంఐ కట్టడం ద్వారా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందవచ్చు. కియా కార్నివాల్ కారును కొనుగోలు చేయడం ద్వారా తొలి ఆరు నెలలు 13,999 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాల కాలపరిమితితో లోన్ సౌకర్యం పొందే అవకాశం ఉండగా కారు ఎక్స్‌షోరూమ్ ధరకు సమానమైన మొత్తాన్ని లోన్ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుంది.

    కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కియా సంస్థ ఆఫర్లను ప్రకటిస్తుండటం గమనార్హం. కొత్తగా కారును కొనుగోలు చేస్తున్న వాళ్లకు కియా సంస్థ ప్రకటించిన ఆఫర్ల వల్ల ప్రయోజనం చేకూరనుంది.