Kia Facelift: భారత కార్ల మార్కెట్లలో కియా కంపెనీ దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన సోనెట్ ఇప్పటికే వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా దీనిని అప్డేట్ ఫీచర్స్ తో ఉత్పత్తి చేసి సోనెట్ ఫేస్ లిప్ట్ గా జనవరి 12 (శుక్రవారం)నాడు ఆవిష్కరించారు. ఇప్పటికే కియా సోనేట్ ఫేస్ లిప్ట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆన్ లైన్ లో రిలీజ్ అయింది. దీంతో లాంచ్ కాగానే బుకింగ్ కు రెడీగా ఉన్న వినియోగదారులు శుక్రవారం నుంచి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పాత సోనెట్ కంటే ఫేస్ లిఫ్ట్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూద్దాం..
కియా ఫేస్ లిఫ్ట్ లో 1.2 లీటర్ పెట్రలో ఇంజిన్, 82 బీహెచ్ పీ పవర్, 115 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో మరో ఇంజిన్ ను కూడా అమర్చారు. 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో 182 బీహెచ్ పీ పవర్, 172 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 114 బీహెచ్ పీ పవర్, 250 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ను కలిగి ఉంది.
కొత్త కియా ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంది. టైగర్ నోస్ ఆకారపు గ్రిల్, క్రౌన్ జ్యూవెల్ ఎల్ ఈడీ ల్యాంప్ తో పాటు ఆకర్షణీయమైన ఎల్ ఈడీ డిఆర్ఎల్ తో కూడా ప్రీమియం లుక్ ను కలిగి ఉంది. ఇందులో 16 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉండడం విశేషం. ఈ ఎస్ యూవీ మైలేజ్ పెట్రోల్ వేరియంట్ లో 18.70 కిలోమీటర్, డీజిల్ వేరియంట్ 18.60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. భద్రతా పరంగా దీనికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ అసిస్ట్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటివి ఆకర్షిస్తాయి.
కొత్త కియా ను 2023 ఏడాదిలోనే లాంచ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇది మార్కెట్లోకి రావడానికి ఆలస్యమైంది. ఆ సమయంలో రూ.25,000 చెల్లించి బుక్ చేసుకున్నారు. కాగా కొత్త కియాను ప్రారంభ ధర రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ ధర రూ.15.69 లక్షలుగా ఉంది. అయితే దీనిపై రానున్న రోజుల్లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.