Kia Electric Car : దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి కియా ఓ కొత్త కారును రిలీజ్ చేసింది. దేశంలోనే మొట్టమొదటి, అత్యంత చౌకైన 7-సీటర్ ఎలక్ట్రిక్ కారుగా కియా కారెన్స్ క్లావిస్ ఈవీ లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ కారు తన ధర, డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో ఇన్నోవా, ఎర్టిగా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కొత్త కారు గురించి పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ ధర రూ.17.99 లక్షల నుంచి మొదలై రూ.24.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ జులై 22, 2025 నుంచి ప్రారంభమవుతాయి. ఈ కొత్త కారు ఇటీవల విడుదలైన ఫేస్‌లిఫ్టెడ్ కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ వెర్షన్. కియా కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు కూడా అదే ఫెసిలిటీ, ప్రీమియం క్యాబిన్ అందిస్తుంది.
Also Read: మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ గురించి అభిమానులకు చేదు వార్త..ఇంత రిస్క్ అయితే కష్టమే!
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ డిజైన్ దాని పెట్రోల్-డీజిల్ వెర్షన్‌ను పోలి ఉంటుంది. అయితే, ఎలక్ట్రిక్ కారుకు అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. చార్జింగ్ పాయింట్ గ్రిల్‌లో ఉంటుంది. LED DRLలు కారు ముందు భాగం మొత్తం వ్యాపించి ఉంటాయి. క్యాబిన్‌లో ఎక్కువ స్పేస్ ఉండేలా ఈ కారును డిజైన్ చేశారు. దీనికి కొత్తగా 17-అంగుళాల ఏరో అల్లాయ్ వీల్స్ అందించారు. ఇది ఈ కారుకు స్పెషల్ లుక్ ఇస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ ICE మోడల్ కంటే 5 మి.మీ. ఎక్కువగా అంటే 200 మి.మీ. ఉంటుంది.
ఈ కారు లోపల గేర్ షిఫ్టర్‌ను సంప్రదాయ స్థానం నుంచి తీసేసి స్టీరింగ్ కాలమ్ కు మార్చారు. ఇది క్యాబిన్‌లో ఎక్కువ స్పేస్ అందిస్తుంది. అందిస్తుంది. ఇందులో 26.6-అంగుళాల పనోరమిక్ డిస్ ప్లే ఉంది, ఇందులో డిజిటల్ కన్సోల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం రెండు స్క్రీన్‌లు ఉన్నాయి. కారులో 90కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు, లెవెల్ 2 ADAS, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్ రూఫ్, యాంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read: మీడియం రేంజ్ హీరోలకు భవిష్యత్తు లేనట్టేనా..? లేటెస్ట్ గణాంకాలు ఏమి చెప్తున్నాయంటే!
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో 169 బీహెచ్పీ పవర్, 255ఎన్ఎం టార్క్ అందించే సింగిల్ మోటార్ ఉంటుంది. ఇది కేవలం 8.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ./గం. వేగాన్ని అందుకుంటుంది. 51.4 kWh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 490 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. అదే 42 kWh బ్యాటరీ సింగిల్ చార్జ్ మీద 404 కి.మీల రేంజ్ ఇస్తుంది.
ఈ కారు 7.4 kW, 11 kW AC ఛార్జర్లకు సపోర్ట్ చేస్తుంది. కియా 100కు పైగా డీలర్‌షిప్‌లలో ఫాస్ట్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ దేశవ్యాప్తంగా 11,000కు పైగా ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ మీద 8ఏళ్లు లేదా 1,60,000 కి.మీ. వారంటీని కియా అందిస్తోంది.