Kawasaki Ninza ZX-10R: హై స్పీడ్ ఇంజిన్ టెక్నాలజీ, స్పోర్ట్స్ బైక్ లల్లో ప్రత్యేక గుర్తింపు, రేసింగ్ కోరుకునేవారికి Kawasaki బైక్స్ బెస్ట్ ఆప్షన్ అని అంటారు. స్టైలిస్ కు మారు పేరు అయిన ఈ టూవీల్స్ ఎంతో మంది యూత్ ఆదరణ పొందాయి. అయితే ఎప్పటి కప్పుడు లేటేస్ట్ టెక్నాలజీతో బలమైన ఇంజిన్ పనితీరుతో ఆకట్టుకోవడానికి కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి కవాసకి బైక్స్ వస్తుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో ఈ Kawasaki Ninza ZX-10Rబైక్ రిలీజ్ అయింది. అప్ డేట్ చేసిన ప్రమాణాలతో పాటు లేటేస్ట్ టెక్నాలజీతో ఉన్న ఈ బైక్ గురించి ఫుల్ డిటేయిల్స్ లోకి వెళితే..
Kawasaki Ninza ZX-10R వేరే లెవల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 998 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. నేటి తరం స్పోర్ట్స్ బైకర్స్ ఎక్కువగా యూరో 5 ప్లస్ బైక్స్ కోరుకుంటున్నారు. వారికి అనుగుణంగా ఉండేలా ఇందులో దీనిని సెట్ చేశారు. ఇది 13,000 ఆర్ పీఎం వద్ద 193 బీహెచ్ పీ పవర్ ను అందిస్తుంది. ర్యామ్ ఎయిర్ తో గరిష్టంగా 203 బీహెచ్ పీ పవర్ ను అందిస్తుంది. ఏరో డైనమిక్ డిజైన్ కలిగిన ఈ కొత్త మోడల్ లో 25 శాతం ఎక్కువగా డౌన్ ఫోర్స్ ఉంటాయి. దూకుడుగా బైక్ నడపాలని అనుకునేవారికి ఇది సపోర్టుగా ఉంటుంది.
యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే ఇందులో స్మార్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లను అమర్చారు. ఇందులో 5 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లే ను అమర్చారు. రైడాలజీ యాప్ట్వారా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS ఇంటర్వెన్షన్ లాజిక్ తో ఏర్పాటు చేశారు. అన్ని రోడ్లు ఒకేలా ఉండకపోవచ్చు. కానీ ఎలాంటి రోడ్లపైనైనా కవాసకి కొత్త బైక్ స్మూత్ డ్రైవింగ్ అనుభూతి పొందవచ్చు. ఈ కొత్త మోడల్ లో BFF ఫోర్క్ తో పాటు BFRC షాక్, ఓహ్లీన్స్ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ డాంపర్ ఇందులో కనిపిస్తాయి.
ఇప్పటి వరకు ఏ బైక్ కు లేని విధంగా ఇది లైమ్ గ్రీన్ కలర్ తో ఆకట్టుకుంటోంది. అలాగే మెటాలిక్ మ్యాట్ గ్రాఫెన్ స్టీల్ గ్రే కూడా అందుబాటులో ఉంది. దీనిని ప్రస్తుతం రూ.19.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.