Journey of the Rupee: భారత రూపాయి విలువలో జరిగిన మార్పులు స్వాతంత్య్రానంతర ఆర్థిక చరిత్రను ప్రతిబింబిస్తాయి. సోషల్ మీడియాలో వ్యాప్తమైన ‘ఒకప్పుడు 1 డాలర్ = 1 రూపాయి‘ అనే ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. రూపాయి విలువ డాలర్‌తో ఎప్పుడూ సమానంగా లేదు. రూ.3.3 రూపాయల నుంచి మొదలైన రూపాయి 78 ఏళ్లలో రూ.90కి పడిపోయింది.
స్వాతంత్య్ర వచ్చిన తర్వాత..
1947లో భారత స్వాతంత్య్ర సమయంలో 1 యూఎస్ డాలర్‌కు సరిగ్గా 3.3 రూపాయిలు సమానం. 1950 నాటికి ఇది 4.76 రూపాయిలకు చేరింది. ఆ కాలంలో ప్రభుత్వమే కరెన్సీ రేట్‌ను నిర్ధారించేది, మార్కెట్ శక్తులకు అవకాశం లేదు.
మొదటి డీవాల్యుయేషన్..
1966లో ఆర్థిక ఒత్తిళ్ల నడువ మొదటి డీవాల్యుయేషన్ జరిగింది. రూపాయి విలువ 7.50 నుంచి 7.90కి తగ్గింది. ఇది దిగ్గజాలు పెరగడానికి, దిగుమతులను నియంత్రించడానికి ఉద్దేశించిన చర్య.
1991 సంక్షోభం..
1990లో విదేశీ మారక రిజర్వులు పూర్తిగా పడిపోయాయి. దేశం దివాళా అంచున నిలిచింది. దిగుమతుల బిల్లులు కూడా చెల్లించలేకపోయింది. దీంతో బంగారం నిల్వలను లండన్‌లో తాకట్టు పెట్టి రుణాలు సేకరించారు. పీవీ నర్సింహారావు ప్రధాని, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా సంస్కరణలు ప్రవేశపెట్టారు. రూపాయి 17.90 నుంచి 22.74కి పడిపోయింది. ఇక మార్కెట్ ఆధారంగా రేటింగ్ మొదలైంది.
మార్కెట్ యుగం..
1991 తర్వాత రూపాయి మార్కెట్ డైనమిక్స్‌కు లోనైంది. ఆర్‌బీఐ డాలర్ రిజర్వులతో జోక్యం చేసుకుంటూ స్థిరత్వం కాపాడుతోంది. అయినా, దీర్ఘకాలికంగా పతనం కొనసాగింది. 2000 సంవత్సరంలో ఒక డాలర్ విలువ రూ.45గా నమోదైంది. 2013 నాటికి రూ.56.6కు పడిపోయింది. 2013లో అమెరికా ఫెడ్ వడ్డీ రేటు పెరగడంతో డాలర్ మరింత బలపడింది. ఇక 2018లో డాలర్‌తో రూపాయి విలువ రూ.70 దాటింది.
2024 నాటికి మరింత పతనం..
ఇక రూపాయి విలువ 2024 నాటికి మరింత పడిపోయింది. డాలర్‌తో రూ.84.8గా నమోదైంది. ప్రస్తుతం(2025 డిసెంబర్) రూపాయి విలువ ఆల్‌టైం రికార్డు పతనం నమోదైంది. ఏడాదిలో 5 శాతం పడిపయి రూ.90గా నమోదైంది. అమెరికా ఆర్థిక బలం, భారత దిగుమతులు, వడ్డీ రేట్లు ప్రధాన కారణాలు.
రూపాయి స్థిరత్వానికి ఎగుమతుల పెంపు, రిజర్వుల బలోపేతం కీలకం. ఆర్‌బీఐ పరిమిత జోక్యంతో మార్కెట్ సమతుల్యత కాపాడాలి. ఈ 78 ఏళ్ల ప్రయాణం భారత ఆర్థిక సంస్కరణల సాక్ష్యం.