Andhrajyothy RK : రూ.70 వేలు ఇస్తామన్నా.. ఎవరూ రావడం లేదు: పాపం ఆంధ్రజ్యోతి ఆర్కే

Andhrajyothy RK : “సెంట్రల్ డెస్క్ లో పనిచేసేందుకు అనుభవం ఉన్న జర్నలిస్టులు కావలెను. వేతనం రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు ఇస్తాం” ఇదీ ఆంధ్రజ్యోతి పేపర్ లో కనిపించిన ప్రకటన. సాధారణంగా తెలుగులో ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రమే జర్నలిజం కళాశాల నోటిఫికేషన్లు ఇస్తాయి. అవి ఎలాగూ బాండెడ్ లేబర్ కొలువులు… సారం తీసి వదిలేస్తాయి. మరీ ముఖ్యంగా కోవిడ్ సమయంలో వందలాది మంది ఆంధ్రజ్యోతి జర్నలిస్టులను ఇలానే బయటకు పంపించాయి. ఈనాడు బలవంతంగా […]

Written By: NARESH, Updated On : January 6, 2023 4:42 pm
Follow us on

Andhrajyothy RK : “సెంట్రల్ డెస్క్ లో పనిచేసేందుకు అనుభవం ఉన్న జర్నలిస్టులు కావలెను. వేతనం రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు ఇస్తాం” ఇదీ ఆంధ్రజ్యోతి పేపర్ లో కనిపించిన ప్రకటన. సాధారణంగా తెలుగులో ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రమే జర్నలిజం కళాశాల నోటిఫికేషన్లు ఇస్తాయి. అవి ఎలాగూ బాండెడ్ లేబర్ కొలువులు… సారం తీసి వదిలేస్తాయి. మరీ ముఖ్యంగా కోవిడ్ సమయంలో వందలాది మంది ఆంధ్రజ్యోతి జర్నలిస్టులను ఇలానే బయటకు పంపించాయి. ఈనాడు బలవంతంగా ఉద్యోగులతో సెలవులు పెట్టించింది.. నమస్తే తెలంగాణ, సాక్షి ఉద్యోగులను బయటకు పంపించింది.. ఆంధ్రజ్యోతి అయితే మరీ ఘోరం… ఉద్యోగులను బయటకు పంపించి ఉన్నవారితో బండెడు చాకిరి చేయించింది. కనీసం కోవిడ్ తో చనిపోతే ఉద్యోగులకు రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. కానీ పొద్దున లేస్తే ఆ రాధాకృష్ణ సర్వతంగ పరిత్యాగిగా నీతులు చెబుతాడు.. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా… ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలే కోవిడ్ బాధిత జర్నలిస్టు కుటుంబాలకు ఆసరా అయ్యాయి. సరే ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు వచ్చింది ఎన్నికల సంవత్సరం. మీడియా సంస్థలకు దండిగా డబ్బులు వచ్చే సంవత్సరం కూడా.. అయితే ఇప్పుడు ఆ స్థాయిలో పని చేసేందుకు ఆంధ్రజ్యోతికి పాత్రికేయుల అవసరం ఏర్పడింది. ఏముంది వెంటనే నోటిఫికేషన్ ఇచ్చింది.

 

 

-యేహే పో అంటున్నారు

కోవిడ్ సమయంలో ఆంధ్రజ్యోతి నిర్దాక్షిణ్యంగా వందలాది మంది ఉద్యోగులను మెడపట్టి బయటికి గెంటేసింది. ఎంతోమంది ఉద్యోగులు ఇతర వ్యాపకాలను చూసుకున్నారు. అయితే పరిస్థితులు కొంతమేర చక్కబడటంతో మేనేజ్మెంట్ మళ్లీ ఆ ఉద్యోగులకు ఫోన్ చేసింది.. కానీ వారంతా కూడా ముఖం మీదే చెప్పేశారు. ” మళ్లీ ఎందుకు పిలుస్తున్నారు సార్? కోవిడ్ ప్రబలితే మళ్లీ ఇళ్లకు పంపిస్తారా? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు” అంటూ గద్గద స్వరంతో చెప్పారు. ఇదే విషయాన్ని ఆర్కే దృష్టికి కొంత మంది పైస్థాయి ఉద్యోగులు తీసుకెళ్తే… “వచ్చేవాడు వస్తుంటాడు.. పోయే వాడు పోతుంటాడు..” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. కానీ ఇదే రాధాకృష్ణ ప్రభుత్వాల పనితీరును మాత్రం భూతద్దంలో పెట్టి చూస్తాడు.

-స్పందన ఏది

ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఎడిషన్ పర్యవేక్షించే తిగుళ్ళ కృష్ణమూర్తి నమస్తే తెలంగాణకు ఎడిటర్ గా వెళ్ళిపోయిన తర్వాత… ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్ ఖాళీ అయింది. దీంతో అసిస్టెంట్ ఎడిటర్ వక్కలంక రమణ సెంట్రల్ డెస్క్ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.. ఇగో వైఫైలో ఉండే ఈయన వల్ల సెంట్రల్ డెస్క్ మెయింటనెన్స్ కాలేదు. జర్నలిస్టులను పీకిపడేసినప్పుడు ఎలాగైతే సూత్రధారిగా ఉన్నాడో.. ఇప్పుడు సాధ్యంకానీ పని అప్పగించినప్పుడు ఇలానే పాత్రధారిగా మిగిలిపోయాడు.. ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ ను విజయవంతంగా నడపలేకపోయాడు. ఇదే సమయంలో ఈనాడు జనరల్ డెస్క్ నుంచి రాహుల్ బయటకు రావడంతో… వెంటనే అతడిని రాధాకృష్ణ క్యాచ్ చేశాడు.. బల్క్ అమౌంట్ ఇచ్చి ఆంధ్రజ్యోతిలోకి తీసుకున్నాడు..

 

-ఆర్కేకు తెలుసో లేదో?

రాహుల్ రాకతో ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్ కొంతమేర బలోపేతమైనప్పటికీ… అటు తిగుళ్ల కృష్ణమూర్తి ఎఫెక్ట్, ఇటు కోవిడ్ తీసివేతలతో పరిస్థితి అధ్వానంగా మారింది. పైగా నాణ్యమైన సబ్ ఎడిటర్లు లేకపోవడంతో జర్నలిజం కాలేజీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు. అయినప్పటికీ ఆశించినంత మేర యువకులు రాకపోవడంతో… జనరల్ డెస్క్ లో పనిచేసేందుకు జర్నలిస్టులు కావాలి అని ప్రకటన ఇచ్చారు. కానీ దానికి వస్తున్న స్పందన కూడా అంతంత మాత్రమే.. ఒకవేళ వచ్చిన వారు కూడా ఎక్కువ రోజులు నిలబడటం లేదు.. డిజిటల్ మీడియాలో అవకాశాలు అపారంగా ఉండటంతో చాలామంది అటువైపు వెళ్తున్నారు..పైగా కోవిడ్ సమయంలో ఉన్నఫళంగా తొలగించడంతో చాలామంది డిజిటల్ జర్నలిజం బాటను ఎంచుకున్నారు. వీరిలో చాలామంది కంటెంట్ రైటర్లు గా రాణిస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు బతిమిలాడి… అవసరం తీరాక గెంటేసిన రాధాకృష్ణ వ్యవహార శైలి చూసి చాలామంది జర్నలిస్టులు ఆంధ్రజ్యోతి అంటేనే అసహ్యించుకుంటున్నారు. పాపం ఈ విషయం ఆ ఆర్కేకు తెలుసో లేదో?!