
JioBook Laptop: దేశీయ టెలీకాం దిగ్గజం జియో టెలీకాం రంగంలో ఎన్నో సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. త్వరలో జియో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. దీపావళి పండుగ కానుకగా జియో స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేయనుంది. అయితే జియో ల్యాప్ టాప్ ను కూడా లాంఛ్ చేయనుందని జియో బుక్ పేరుతో మార్కెట్ లోకి ఈ ల్యాప్ టాప్ రానుందని సమాచారం.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కు జియో ల్యాప్ టాప్ మోడల్ ధృవీకరణ కొరకు దరఖాస్తు చేసుకుందని తెలుస్తోంది. బీఐఎస్ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత మార్కెట్ లోకి జియో బుక్ వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. జియో బుక్ ల్యాప్ టాప్ ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్ లోకి రానుందని తెలుస్తోంది. 14 అంగుళాల హెచ్డీ డిస్ ప్లేతో మార్కెట్ లోకి ఈ ల్యాప్ టాప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ ల్యాప్ టాప్ లో స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను వినియోగించారని స్నాప్ డ్రాగన్ ఎక్స్ 12 4జీ మోడెమ్ కూడా ఈ ల్యాప్ టాప్ లో ఉంటుందని సమాచారం. 64 జీబీ ఈ.ఎమ్.ఎమ్.సీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ తో ఈ ల్యాప్ టాప్ మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. క్వాల్ కోమ్ ఆడియో చిప్, త్రీ యాక్సిస్ యాక్సిలెరోమీటర్, బ్లూటూత్, డ్యూయల్ బాండ్ వైఫై, మినీ హెచ్.డీ.ఎమ్.ఐ కనెక్టర్, ఇతర ఫీచర్లు ఈ ల్యాప్ టాప్ లో ఉంటాయని సమాచారం.
జియో యాప్స్ తో పాటు మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన యాప్స్ కూడా ల్యాప్ టాప్ లో ప్రీ ఇన్ స్టాల్డ్ గా ఉంటాయని తెలుస్తోంది. 12,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యలో ఈ ల్యాప్ టాప్ ధర ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.