https://oktelugu.com/

ఆధార్ తో అకౌంట్ లింక్ చేసుకున్నారా.. లేకపోతే రూ.2 లక్షలు నష్టం..?

దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో కేంద్రం జన్ ధన్ యోజన ఖాతాలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. బ్యాంక్ అకౌంట్ లేని వారు ఎవరైనా సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి జీరో బ్యాలెన్స్ తో బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఇప్పటికే దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు జన్ ధన్ ఖాతాను కలిగి ఉండటంతో పాటు ఆ ఖాతా ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. జన్ ధన్ ఖాతాను కలిగి ఉన్నవాళ్లు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 13, 2021 3:23 pm
    Follow us on

    దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో కేంద్రం జన్ ధన్ యోజన ఖాతాలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. బ్యాంక్ అకౌంట్ లేని వారు ఎవరైనా సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి జీరో బ్యాలెన్స్ తో బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఇప్పటికే దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు జన్ ధన్ ఖాతాను కలిగి ఉండటంతో పాటు ఆ ఖాతా ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు.

    జన్ ధన్ ఖాతాను కలిగి ఉన్నవాళ్లు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకోవాలి. ఏదైనా కారణం చేత బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకోకపోతే వాళ్లు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎవరైతే జన్ ధన్ ఖాతాను కలిగి ఉంటారో వాళ్లు రూపే కార్డ్ ద్వారా లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. జనధన్ ఖాతాపై ఏకంగా 2 లక్షల రూపాయల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను పొందే అవకాశం ఉంటుంది.

    ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ కార్డుకు లింక్ చేసుకుంటారో వారు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. జన్ ధన్ ఖాతా కలిగిన వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ ఖాతాను కలిగి ఉన్నవాళ్లు 30 వేల రూపాయలు బీమా పొందే అవకాశం ఉంటుంది. ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉండదు కాబట్టి వీలైనంత త్వరగా జన్ ధన్ ఖాతాకు ఆధార్ ను లింక్ చేసుకుంటే మంచిది.

    ఇప్పటివరకు జన్ ధన్ ఖాతాకు ఆధార్ నంబర్ ను లింక్ చేసుకోని వాళ్లు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఆధార్ కు బ్యాంక్ అకౌంట్ ను సులభంగా లింక్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ కు సంబంధించి సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.