Mango Leaves: ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. బీజీ లైఫ్.. ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు జాబ్ చేస్తుండడంతో మార్కెట్లకు వెళ్లే తీరిక కూడా చాలా మందికి దొరకడం లేదు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలలో మార్కెట్‌కు వెళ్లడం అస్సలు కుదరని పని. ట్రాఫిక్ సమస్యతో ఉదయం వెళ్లిన వారు.. ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుతున్నారు. ఈ తరుణంలో ఆన్‌లైన్ మార్కెటింగ్ సంపన్నులకు వరంగా మారింది. క్రమంగా అది మధ్య తరగతి వర్గాలకూ విస్తరించింది. దీంతో ఆన్‌లైన్ స్టోర్స్ వేగంగా విస్తరిస్తున్నాయి.
గుండు పిన్ను నుంచి…
ఆన్‌లైన్ స్టోర్లలో గుండు పిన్ను నుంచి విలువైన వస్తువుల వరకు అన్నీ లభిస్తున్నాయి. తాజాగా పాతకాలం వస్తువులను కూడా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. జనం నాడిని పట్టుకున్న ఆన్‌లైన్ స్టోర్లు.. ప్రజల అభిరుచికి అనుగుణంగా వస్తువులును తమ స్టోర్లలో అందుబాటులో ఉంచుతున్నాయి. నిత్యావసరాలతోపాటు, బెడ్లు, కుర్చీలు, ఎలక్ట్రిక్ వస్తువులు, గడియారాలు.. ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్లు… దుస్తులు.. ఇలా అనేకం ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
మొక్కలు కూడా..
ఇటీవల ఆన్‌లైన్ స్టోర్లలో మొక్కలు కూడా దొరుకుతున్నాయి. ఇళ్లలో పెంచుకునే బోన్‌సాయి మొక్కలను సేల్ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు తమకు నిచ్చన మొక్కలు తెప్పించుకుంటున్నారు. కూరగాయల విత్తనాలు సైతం ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. ఇళ్ల డాబాలపై, కుండీల్లో పెంచే మొక్కల విత్తనాలను సేల్ చేస్తున్నాయి ఆన్‌లైన్ స్టోర్స్.
తాజాగా మామిడి ఆకులు..
ఇక తాజాగా అరటి, మామిడి ఆకులను కూడా విక్రయించడం మొదలు పెట్టాయి ఆన్‌లైన్ స్టోర్లు. పండుగల వేళ పూజలకు , ఇళ్ల అలంకరణకు అవసరమైన మామిడి, అరటి ఆకుటులు, బంతి, చామంతి పూలు విక్రయిస్తున్నాయి. దీపావళి సందర్భంగా కొన్ని ఆన్‌లైన్ స్టోర్లలో మామిడి, అరటి ఆకులు ప్రతక్ష్యం అయ్యాయి. దీంతో మామిడాకులు, పూలు కూడా మార్కెట్లలో ఇక దొరకవా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్ చేస్తున్న నెటిజన్లు..
ఆన్‌లైన్ స్టోర్లలో మామిడి, అరటి ఆకులు విక్రయించడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. జనాన్ని బద్ధకస్తులను చేయడానికి, చిరు వ్యాపారాలను దెబ్బతీయడానికి ఆన్‌లైన్ మార్కెట్ దోహదపడుతున్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే అనేక మంది చిరువ్యాపారులు ఆన్‌లైన్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌తో ఉపాధి కోల్పోయారు. తాజాగా పండుగల వేళ విక్రయించే ఆకులు, పూలు కూడా ఆన్‌లైన్‌లో అమ్మితే రైతుకు మిగిలేది ఏమీ ఉండదంటున్నారు. మరికొందరేమో మామిడాకులకు ఇంత కరువొచ్చిందా.. ఎక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి మరింత ఎక్కువ ధరకు అమ్ముతున్నారని అంటున్నారు. సామాన్యులను బద్దకస్తులను చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Is there such a drought for mango leaves
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com