రైలు ఆలస్యమైతే ఛార్జీలు వాపస్ పొందే ఛాన్స్.. ఎలా అంటే?

దేశంలో కరోనా కేసులు తగ్గినా తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో వైరస్ బారిన పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రత్యేక రైళ్లు మాత్రమే తిరుగుతున్న నేపథ్యంలొ రైళ్లలో టికెట్ దొరకడం తేలికైన విషయం కాదు. ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇలా చేయడం ద్వారా ఏ సమస్య లేకుండా సులువుగా ప్రయాణించడం సాధ్యమవుతుంది. ఏదైనా కారణం చేత ప్రయాణాన్ని వాయిదా వేసుకునే […]

Written By: Navya, Updated On : July 14, 2021 10:06 am
Follow us on

దేశంలో కరోనా కేసులు తగ్గినా తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో వైరస్ బారిన పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రత్యేక రైళ్లు మాత్రమే తిరుగుతున్న నేపథ్యంలొ రైళ్లలో టికెట్ దొరకడం తేలికైన విషయం కాదు. ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇలా చేయడం ద్వారా ఏ సమస్య లేకుండా సులువుగా ప్రయాణించడం సాధ్యమవుతుంది.

ఏదైనా కారణం చేత ప్రయాణాన్ని వాయిదా వేసుకునే వాళ్లు టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్ ను తెలుసుకోవడం ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు. దేశంలోని రైళ్ల ద్వారా ప్రతిరోజు కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. కరోనా వల్ల పరిమితంగా సేవలు అందిస్తున్న భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలను తీసుకుంటూ ఉండటం గమనార్హం.

అయితే సరైన సమయానికి రైలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రైలు ఆలస్యం అయితే రైల్వే టికెట్ డబ్బును ప్రయాణికులకు ఇస్తుంది. రైలు మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే టికెట్ ను క్యాన్సిల్ చేసుకుని టికెట్ కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

టికెట్ ను రద్దు చేసుకోవాలనుకునే ప్రయాణికులు టికెట్ డిపాజిట్ రసీదును నింపి వెంటనే సగం మొత్తాన్ని పొందవచ్చు. రైలు ప్రయాణం పూర్తైతే మిగిలిన సగం డబ్బులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.