ఇండియన్ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఆఫర్లను ప్రకటించడంతో పాటు బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. రైళ్లలో తరచూ ప్రయాణం చేసేవాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త ఆఫర్ ను ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్ కాంటెస్ట్ ను తీసుకొనిరావడం గమనార్హం.
ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించగా ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వాళ్లు ఒక వీడియోను చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో రైల్వేస్ గురించి లేదా రైల్వేస్‌కు సంబంధించిన టికెటింగ్, కేటరింగ్, చాట్‌బాట్, టూరిస్ట్, టూరిజం మీద చేయవచ్చు. ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలని అనుకుంటే https://corover.ai/vlog/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగష్టు 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
ఈ కాంటెస్ట్ లో టాప్ 3లో నిలిచిన వాళ్లు విన్నర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి విజేత లక్ష రూపాయలతో పాటు సర్టిఫికెట్ ను, ట్రోఫీని పొందే అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ ప్లేస్ లో ఉన్నవాళ్లు 50వేల రూపాయలు, సర్టిఫికెట్, ట్రోఫీని పొందే అవకాశం అయితే ఉంటుంది. మూడో స్థానంలో నిలిచిన వాళ్లు రూ.25 వేలు, సర్టిఫికెట్, ట్రోఫీ పొందవచ్చు. దాదాపు 300 మందిని ఐఆర్‌సీటీసీ విజేతగా ప్రకటిస్తుందని సమాచారం.
మిగిలిన స్థానాల్లో నిలిచిన వాళ్లకు 500 రూపాయల గిఫ్ట్ కార్డ్ తో పాటు సర్టిఫికెట్ కూడా లభించే అవకాశం అయితే ఉంటుంది. ఎవరి వీడియోలు అయితే ఎంపికవుతాయో ఆ వీడియోలను ఐఆర్‌సీటీసీ అధికారిక ఛానల్స్ లో అప్ లోడ్ చేయడం జరుగుతుంది. కనీసం నిమిషం నిడివి ఉన్న వీడియోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.