Foreign Investments: ఆర్థికపరమైన అంశాల గురించి చర్చించేటప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికా గురించే మాట్లాడుకునేవి. కానీ ఇప్పుడు భారత్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అభివృద్ధిలో వేగం పుంజుకుంటున్న భారత్ అమెరికా, చైనా వంటి దేశాలతో పోటీపడుతుంది. ప్రపంచంలో ఏర్పడిన ఆర్థిక మాంద్య పరిస్థితులతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న శుంకాల నిర్ణయం పై చాలా మంది పెట్టుబడుదారులు ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా వంటి దిగ్గజాలు ఇటీవల లక్షల కోట్ల పెట్టుబడును భారత్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం శుభపరిణామం. అయితే భారత్లో మీరు పెట్టుబడులు పెట్టడానికి గల కారణం ఏంటి?
వివిధ దేశాల అధినేతలు, ప్రపంచ స్థాయిలో టాప్ లెవల్ లో ఉన్న కంపెనీ ప్రతినిధులు భారతదేశానికి వరుసగా వస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రైసింగ్ సమ్మిట్ లో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు వచ్చి తమ పెట్టుబడుల గురించి వివరించారు. అలాగే దేశంలోని చాలా ప్రదేశాల్లోకి విదేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించి మిగతా దేశాల్లో కంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం సేఫ్ అని భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ 17.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. అలాగే ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ సైతం 2030 నాటికి భారత్లో 35 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. దీంతో భారత్ కు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన ఉండడమే కాకుండా.. ఎగుమతులు, దిగుమతులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్రల్లో 12.7 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సంస్థ వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. కంప్యూటర్ మౌలిక వసతులు, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ వంటి వాటిని విస్తరించడం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. అమెరికా తర్వాత అతిపెద్ద గూగుల్ సెంటర్ భారత దేశంలోనూ అందులోనూ తెలుగు రాష్ట్రంలోని విశాఖలో ఏర్పాటు కావడం విశేషం. సోషల్ మీడియా సంస్థ అయినా మెటా గ్రూప్ భారతదేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తో కలిసి 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మెటా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఏఐ సేవలను అందించేందుకు రెడీ అవుతుంది. అయితే సిపి టెక్నాలజీ తో కలిసి విశాఖలో 500 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.
అయితే మిగతా దేశాల్లో కంటే భారత్ లో ఖర్చులు తక్కువగా ఉండడంతో పాటు.. నిర్వహణకు అనుకూలంగా ఉండడంతో చాలా దేశాల ప్రతినిధులు భారత్ వైపు చూస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచంలోని అగ్రదేశాల సరసన భారత్ చేరడం ఖాయం అని కొందరు ఆర్థిక నిపుణులు కొనియాడుతున్నారు.