Lic Policy: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. ఎల్ఐసీ అమలు చేస్తున్న స్కీమ్స్ లో జీవన్ లాభ్ పాలసీ కూడా ఒకటి. జీవన్ లాభ్ పాలసీ ఎండోమెంట్ పాలసీ కాగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు.
ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు పాలసీ వ్యవధి 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండనుంది. ఈ పాలసీలో చేరడానికి 59 సంవత్సరాలు గరిష్ట వయస్సు అని చెప్పవచ్చు. ప్రీమియం చెల్లింపు విషయంలో నచ్చిన ఆప్షన్ ను ఎంపిక చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. చెల్లించిన ప్రీమియంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
పాలసీదారు చనిపోతే నామినీ బోనస్ తో పాటు హామీ బెనిఫిట్ ను కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మూడేళ్లు ప్రీమియం చెల్లిస్తే లోన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఎల్ఐసీ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో రోజుకు 262 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే పాలసీ మెచ్యూరిటీ సమయానికి ఏకంగా 20 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.