https://oktelugu.com/

Microsoft CEO Satya Nadella: తండ్రి ఐఏఎస్ ఆఫీసర్.. కొడుకు వేతనం 450 కోట్లు

సత్య నాదెళ్ల తల్లి సంస్కృత ఉపన్యాసకురాలు. ఆయన తండ్రి నాదెళ్ల యుగేందర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సత్య నాదెళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : July 6, 2023 / 10:24 AM IST
    Follow us on

    Microsoft CEO Satya Nadella: సాధారణంగా కొడుకు తనను మించిపోతే ఏ తండ్రికైనా గర్వంగా ఉంటుంది. ఆ ఆనందం అతడి మనసులో తొణికిసలాడుతుంది. ఈ సువిశాల భారతావనిలో ఎంతోమంది కుమారులు తమ తండ్రుల ఆశయాలు సాధించి, వారిని మించి పోయే స్థానంలో స్థిరపడ్డారు. తండ్రులకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చారు. ఇక ఇలాంటి సంఘటనలను మీడియాలోనూ మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మేం పరిచయం చేయబోయే వ్యక్తి ఆయన తండ్రి స్థానానికి మరింత గౌరవం తీసుకొచ్చారు. ఆయనకు అనితర సాధ్యమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టారు. ఇంతకీ ఆయన ఎవరంటే.

    సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ సీఈవోగా పనిచేస్తున్న ఈ భారతీయుడి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇతడి వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతవరకు ఈ మీడియా హౌస్ కూడా దీని గురించి పెద్దగా ఫోకస్ చేయలేదు. సత్య నాదెళ్ల గురించి చెప్పాలంటే ముందుగా అతడి వ్యక్తిగత నేపథ్యాన్ని వివరించాల్సి ఉంటుంది. ఒక సినిమా కథకు ఏమాత్రం తీసిపోదు. సత్య నాదెళ్ల 1967 లో హైదరాబాదులో జన్మించారు. బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత సీఈవోగా మైక్రోసాఫ్ట్ ను ముందుకు తీసుకెళుతున్న వ్యక్తిగా సత్య నాదెళ్ల నిలిచారు. పంచతంగా గుర్తింపు పొందిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా నిలిచారు. 2014లో కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టకముందు ఆయన కంపెనీ క్లౌడ్, ఎంటర్ ప్రైజ్ గ్రూప్ న కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

    సత్య నాదెళ్ల తల్లి సంస్కృత ఉపన్యాసకురాలు. ఆయన తండ్రి నాదెళ్ల యుగేందర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సత్య నాదెళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. అడక బెంగళూరులోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత విస్కాన్సిన్ మిల్వాకి విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. అలాగే చికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరడానికి ముందు సత్య నాదెళ్ల కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్ లో పనిచేశారు. 2013లో సత్య నాదెళ్ల జీతం 7.6 మిలియన్ డాలర్ల నుంచి 2016లో 84.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన భార్య అనుపమ నాదెళ్ల తండ్రి సైతం ఐఏఎస్ అధికారి. ఆమె మణిపాల్ యూనివర్సిటీలో సత్య నాదెళ్ల జూనియర్. అక్కడ ఆమె బి.ఆర్క్ పూర్తి చేశారు. సత్య నాదెళ్ల సగటు భారతీయుడు మాదిరిగానే క్రికెట్ లవర్. కవితాని చదవడాన్ని ఇష్టపడతారు.

    2.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన మైక్రోసాఫ్ట్ కంపెనీని నడుపుతున్న సత్య నాదెళ్ల ఆస్తుల విలువ 6,200 కోట్లుగా ఉంది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2021_ 2022లో సత్య నాదెళ్ల వార్షిక వేతనం 54.9 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం ఆయన ఏడాది సంపాదన 450 కోట్లుగా ఉంది. అంతేకాదు ఆయన బేస్ పేమెంట్ 2.5 మిలియన్ డాలర్లు. స్టాక్ ఆప్షన్ల రూపంలో 42.3 మిలియన్ డాలర్లను ఆయన సంపాదిస్తున్నారు. తన కొడుకు ఈ స్థాయిలో ఎదగడాన్ని చూసి ఆయన తండ్రి పలుమార్లు గర్వంగా చెప్పుకున్నారు. అతడిని చూసి మనసు ఉబ్బి తబ్బిబవుతుందని ఉద్వేగానికి గురయ్యారు.. ఒక ఐఏఎస్ కొడుకు ఏకంగా టెక్నాలజీకి పాఠం నేర్పిన కంపెనీకి సారథ్యం వహించడం గొప్ప విషయం.