Aadhar Card Correction: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమైన కార్డ్ అనే సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కచ్చితంగా పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అయితే ఆధార్ కార్డ్ లో అడ్రస్ ను మార్చుకునే విషయంలో చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరాలలో, పట్టణాలలో నివశించే వాళ్లకు ఆధార్ లో అడ్రస్ మార్చుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆధార్ కార్డ్ లో అడ్రస్ ను మార్చుకోవాలంటే 46 పత్రాలలో ఏదో ఒక డాక్యుమెంట్ ను అందిస్తే సరిపోతుంది. అయితే ఈ డాక్యుమెంట్లలో కూడా పాత అడ్రస్ ఉంటుంది కాబట్టి సమస్య ఎదురవుతోంది. ఇలాంటి ఇబ్బంది ఎదురైతే గెజిటెడ్ అధికారి, కౌన్సిలర్, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎం.ఎల్.సీలు అడ్రస్ ను ధృవీకరిస్తే ఆధార్ కార్డ్ లో అడ్రస్ ను మార్చుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. దరఖాస్తుదారు ఫోటో ఉంటే మాత్రమే అడ్రస్ మార్చుకోవడం సాధ్యమవుతుంది.
Also Read: Chiranjeevi- Vishal: హీరో విశాల్ కుటుంబంతో చిరంజీవికి ఉన్న ప్రత్యేక అనుబంధం ఇదే..
పోస్టాఫీస్ లో అకౌంట్ ను ఓపెన్ చేస్తే ఆ అకౌంట్ లోని అడ్రస్ ఆధారంగా కూడా ఆధార్ కార్డ్ అడ్రస్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. సొంతిట్లో ఉండేవాళ్లు కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు ఆధారంగా అడ్రస్ ను మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లు మాత్రం రెంటల్ అగ్రిమెంట్ ఆధారంగా అడ్రస్ ను మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అద్దె ఇంట్లో ఉండేవాళ్లు గ్యాస్ కనెక్షన్ సహాయంతో కూడా అడ్రస్ ను మార్చుకునే వీలైతే ఉంటుందని చెప్పవచ్చు. గ్యాస్ పైప్ లైన్ ఉన్నవాళ్లు ఓటర్ కార్డ్, ఇతర పత్రాల సహాయంతో అడ్రస్ ను మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: Janasena Formation Day: నేడే జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం.. పవన్ ఏం చెప్పనున్నారు?