Tata new Nano: మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా కార్లో ప్రయాణించాలని ఉంటుంది. కానీ ఫోర్ వీలర్ అధిక ధర ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తారు. అయితే Tata లాంటి కంపెనీలు మాత్రం మధ్యతరగతి వారు కూడా కారులో ప్రయాణించాలన్న ఉద్దేశంతో లక్ష రూపాయల Nano కారును మార్కెట్లోకి తీసుకువచ్చారు. అయితే ఇది అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ Nano అప్డేట్ అయ్యి మిగతా కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి రాబోతుంది. ధర మాత్రం సామాన్యులకు అందుబాటులోనే ఉండేలా నిర్ణయించారు. పూర్తిగా విద్యుత్ వేరియంట్ లో వస్తున్న ఈ కారు గురించి సమాచారం ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేశారు. అయితే ఇటీవల దీని ధరతో పాటు మైలేజ్ గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. అదేంటంటే..?
త్వరలో మార్కెట్లోకి రాబోతున్న Tata Nano అప్డేట్ అయినా కారు డిజైన్ కొత్తగా రూపుదిద్దుకుంది. సెడాన్ కారు వలె ఉన్న ఈ వెహికిల్ నగరాల్లో ఉండేవారు ట్రాఫిక్ లో నుంచి బయటపడడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ కారు క్యాబిన్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. అంతేకాకుండా ఎక్స్టీరియర్ ప్లేస్ తక్కువగా ఉండడంతో ఈజీగా ప్రయాణం చేయవచ్చు. పేరుకు కాంపాక్ట్ కారు అయినప్పటికీ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ లో రాబోతుంది. ఇందులో 17 నుంచి 21 కిలో వాట్ బ్యాటరీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ అయితే 300 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. మిగతా కార్ల కంటే వేగవంతంగా చార్జింగ్ అయ్యే విధంగా ఈ బ్యాటరీ పనిచేయనుంది.
అలాగే ఈ కారులో ఆకట్టుకునే విధంగా ఫీచర్లను సెట్ చేశారు. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉండడంతో కొత్తగా కారు నడిపే వారికి కూడా కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇప్పటికే ఈ కారు గురించి తెలియడంతో చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ లో రాబోతున్నాయి కారు ధర రూ.2.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే 2026 ఏడాది మధ్యలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారు తక్కువ ధరతో పాటు అత్యధిక మైలేజ్ ఇవ్వడంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు కారు కొనలేని వారు.. కొత్తగా దీనిని కొనుగోలు చేసి అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు అని చెబుతున్నారు.