రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఆ ఛార్జీలు చెల్లించాల్సిందే?

దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లడానికి రైలు ప్రయాణం బెస్ట్ అని చాలామంది భావిస్తుండటం గమనార్హం. అయితే తాజాగా రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ప్రయాణం చేయాలంటే రిజర్వ్ చేసిన సీట్ల విధానం కొనసాగుతుందని వెల్లడించింది. మన దేశంలో ఏకంగా 23 మిలియన్ల మంది సెకండ్ క్లాస్ ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఎక్కువ దూరం […]

Written By: Kusuma Aggunna, Updated On : December 11, 2021 8:09 am
Follow us on

దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లడానికి రైలు ప్రయాణం బెస్ట్ అని చాలామంది భావిస్తుండటం గమనార్హం. అయితే తాజాగా రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ప్రయాణం చేయాలంటే రిజర్వ్ చేసిన సీట్ల విధానం కొనసాగుతుందని వెల్లడించింది. మన దేశంలో ఏకంగా 23 మిలియన్ల మంది సెకండ్ క్లాస్ ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు.

కరోనా మహమ్మారి సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు సాధారణ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ మొత్తం చెల్లించారు. అయితే రైళ్ల వర్గీకరణ వల్ల ప్రస్తుతం పూర్వం మాదిరిగానే ఛార్జీలు ఉన్నాయి. అయితే రెండవ తరగతి ప్యాసింజర్ రైళ్లు మాత్రం రిజర్వ్‌డ్‌గా కొనసాగనున్నాయి. ఇందువల్ల రైళ్లలో తక్కువ దూరం ప్రయాణానికి కూడా రైలు ఛార్జీ, రిజర్వేషన్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

రెండవ తరగతి ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరోవైపు 2020 – 2021 మధ్య కాలంలో 364 ప్యాసింజర్ సర్వీసులు ఎక్స్ ప్రెస్ సర్వీసులుగా అప్ గ్రేడ్ అయ్యాయి. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వేశాఖ ప్రజలపై భారం పెరిగేలా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఖర్చులు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇలాంటి సమయంలో సెకండ్ క్లాస్ ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే వాళ్లపై అదనపు భారం పడేలా రైల్వే శాఖ నిర్ణయం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.