Gram Suraksha Yojana: నెలకు రూ.1500తో రూ.35 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?

Gram Suraksha Yojana: పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఎన్నో స్కీమ్స్ అమలులో ఉండగా ఆ స్కీమ్స్ లో గ్రామ సురక్ష యోజన ఒకటి. ఇండియా పోస్టాఫీస్ గ్రామీణ ప్రజల కొరకు ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. నెలకు ఈ స్కీమ్ లో 1500 రూపాయలు డిపాజిట్ చేస్తే ఏకంగా 35 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. https://www.indiapost.gov.in/financial/pages/content/post-office-saving-schemes.aspx వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 19 సంవత్సరాల కంటే […]

Written By: Kusuma Aggunna, Updated On : January 21, 2022 11:20 am
Follow us on

Gram Suraksha Yojana: పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఎన్నో స్కీమ్స్ అమలులో ఉండగా ఆ స్కీమ్స్ లో గ్రామ సురక్ష యోజన ఒకటి. ఇండియా పోస్టాఫీస్ గ్రామీణ ప్రజల కొరకు ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. నెలకు ఈ స్కీమ్ లో 1500 రూపాయలు డిపాజిట్ చేస్తే ఏకంగా 35 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. https://www.indiapost.gov.in/financial/pages/content/post-office-saving-schemes.aspx వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Gram Suraksha Yojana

19 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోకూడదు. ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ స్కీమ్ కోసం గరిష్ట అర్హత పరిమితి 55 సంవత్సరాలుగా ఉంది. ఈ స్కీమ్ యొక్క కనీస విలువ 10,000 రూపాయలుగా ఉంది. 10 లక్షల రూపాయల వరకు ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది.

Also Read: పది అర్హతతో మంచి వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

పెట్టుబడిదారుడు ప్రీమియంను మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలల చొప్పున, సంవత్సరం ప్రాతిపదికన చెల్లించవచ్చు. ప్రీమియంను సరైన సమయానికి చెల్లించడం సాధ్యం కాకపోతే గ్రేస్ పీరియడ్ లోగా చెల్లించవచ్చు. ఈ స్కీమ్ లో నెలకు 1500 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత 35 లక్షల రూపాయలు పొందవచ్చు. 19 సంవత్సరాల వయస్సులో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే 60 సంవత్సరాల వయస్సులో ఈ బెనిఫిట్ పొందవచ్చు.

గ్రామ సురక్ష యోజన స్కీమ్ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. పాలసీని సరెండర్ చేస్తే మాత్రం ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ను పొందలేరు.

Also Read: ట్రెండింగ్ న్యూస్.. ఏడాదిలో 3 వేల కోట్ల అప్పు తీర్చిన మహిళ..!