India GDP
India GDP : భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచి, గత పదేళ్లలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనాల ప్రకారం, దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, 2025 నాటికి 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ రెట్టింపు వృద్ధి రేటు భారతదేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలబెట్టింది. ఈ ఆర్థిక ప్రయాణం దేశ సామర్థ్యాన్ని, అవకాశాలను ప్రపంచానికి చాటింది. ఈ విజయం వెనుక బలమైన దేశీయ వినియోగం, పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు, ప్రభుత్వం చేప23పై సంస్కరణలు కీలక పాత్ర పోషించాయి.
Also Read : పాతికేళ్లలో అద్భుతాలు చేయనున్న భారత్.. దేశ జీడీపీ రూ. 2,95,34,10,25,00,00,000
జీఎస్టీ, మేక్ ఇన్ ఇండియా..
జీఎస్టీ (వస్తు, సేవల పన్ను), డిజిటల్ ఇండియా వంటి సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేశాయి. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్యక్రమం తయారీ రంగాన్ని, ఎగుమతులను బలోపేతం చేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఈ వృద్ధికి దోహదపడింది. IMF డేటా ప్రకారం, భారతదేశం 2025లో జపాన్(Japan)ను అధిగమించి నాల్గవ స్థానంలో నిలవనుంది, 2027 నాటికి జర్మనీ(Jarmani)ని దాటి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. ఈ వృద్ధి రేటు 2024–25లో 6.5–7% వద్ద కొనసాగుతుందని IMF అంచనా వేస్తోంది, ఇది భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలపరుస్తుంది.
సవాళ్లు కూడా..
అయితే, ఈ పురోగతి సాధించినప్పటికీ, ఆదాయ అసమానతలు, ఉపాధి అవకాశాల సృష్టి వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంది. గత దశాబ్దంలో భారతదేశం తన ఆర్థిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది, మరియు ఈ ప్రయాణం దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది.
Also Read : నాణేల నుంచి డిజిటల్ వరకు.. కరెన్సీ చరిత్ర ఇదీ!