SBI Scheme: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎస్బీఐ కొత్తగా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ ను అమలులోకి తీసుకొచ్చింది. కనీసం 1,000 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్బీఐ అందిస్తున్న వడ్డీరేటునే ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్ పై కూడా పొందవచ్చు.
కనీసం ఐదు సంవత్సరాల పాటు డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ ను ఎంపిక చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందడంతో పాటు మంచి రాబడిని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే ఇన్వెస్ట్ చేసిన డబ్బులను ఐదేళ్ల పటు వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి.
Also Read: అమరావతి రైతులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే..?
ఐదు సంవత్సరాల తర్వాత అవసరమైతే మరో ఐదేళ్ల పాటు ఈ స్కీమ్ లో కొనసాగాలి. పది సంవత్సరాలలోపు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 5.5 శాతం వడ్డీగా పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నామినేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. సెక్షన్ 80సీ కింద ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి పన్ను మినహాయింపు బెనిఫిట్స్ లభిస్తాయి.
పాన్ కార్డును కలిగి ఉంటే మాత్రమే ఈ స్కీమ్ లో చేరడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
Also Read: వివేకా హత్య కేసు: ఏ క్షణమైనా చార్జి షీట్
Recommended Video: