iPhone 18 series: ప్రపంచవ్యాప్తంగా iphone కు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. భారత్లో ఈ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయంటే ఎగబడి కొంటారు. ఇప్పటివరకు 17 సిరీస్ వరకు వచ్చిన iPhone.. ఆ తర్వాత సిరీస్ తెస్తుందా? అన్న సందేహం చాలా మందిలో ఉంది. అయితే తాజాగా దీనిపై ఓ విశ్లేషకుడు సంచలమైన ప్రకటన చేశాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో iphone 18 మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. అంతేకాకుండా ఈ మొబైల్లో ఇప్పటివరకు లేని కొత్త అప్డేట్లు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. నెట్వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ మొబైల్ అద్భుతంగా పనిచేయబోతుందని అంటున్నారు. ఇంతకీ మీ ఫోన్లో ఉండే కొత్త సాఫ్ట్వేర్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
Macrumors అనే పరిశోధనలో Gf సెక్యూరిటీస్ పరిశ్రమ విశ్లేషకుడు Jef phu.. ఐఫోన్ కొత్త సిరీస్ గురించి చెప్పాడు. ఈ సెప్టెంబర్ లో ఇది మార్కెట్లోకి వస్తుందని అంటున్నారు. అయితే సాధారణంగా కొత్త సిరీస్ వచ్చినప్పుడు ప్రో కూడా వస్తుంది. ఇప్పుడు కూడా ఐఫోన్ 18 ప్రో తో పాటు ప్రో మాక్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ రెండు ఫోన్లలో ఇప్పటివరకు రాణి కొత్త సాఫ్ట్వేర్ను ప్రవేశ పెట్టమన్నారు. ఇందులో నానోమీటర్ ప్రక్రియను ఉపయోగించి తయారుచేసిన A20 చిప్ సెట్ ను ఉంచనున్నారు. ఇది SoC కొత్త ఆర్కిటెక్చర్, ప్యాకేజింగ్ డిజైన్తో కలిగి ఉండనుంది. అలాగే ఇది మెరుగైన పవర్ ను అందిస్తుంది. వీటితోపాటు ఈ మొబైల్స్ లో N2 చిప్ ద్వారా అదనపు శక్తి పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మొదటి , రెండు విడతల్లో ఈ సాఫ్ట్వేర్లు ఉంటాయని పేర్కొన్నారు.
అయితే ఆ తర్వాత వచ్చే విడతలో C2 మోడెమ్ తో ఉంటుందని అన్నారు. ఇది NR NTR కు సపోర్ట్ చేసి నెట్వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇప్పటివరకు వచ్చిన యాపిల్ ఫోన్లలో లేదు. కొత్తగా వచ్చే 18 సిరీస్లో మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ లో 48 MP మెయిన్ కెమెరా ఉండరు ఉంది. ఈ కెమెరాతో నేటితరం వారికి చాలా ఉపయోగాలు ఉండనున్నాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ తో పాటు, సోషల్ మీడియా కంటెంట్ ఉపయోగించే వారికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఇందులో మెరుగైన బ్యాటరీ కూడా చేర్చనున్నారు. ఇప్పటివరకు 17 సిరీస్ వరకు కొనుగోలు చేసిన వినియోగదారులు 18 సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఇలాంటి అప్డేట్ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని నిపుణులు అంటున్నారు.