https://oktelugu.com/

IPhone : రూ.10వేలకే ఐఫోన్ ఇస్తున్నామంటే అని ముందు వెనుక ఆలోచించకుండా కొనేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త

IPhone : ప్రస్తుతం మనం ఇంటర్నెట్ యుగంలో జీవిస్తున్నాం. కరోనా వచ్చిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అవసరం అయింది. చాలా పనులు ఇంటర్నెట్ ఆధారంగా స్మార్ట్ ఫోన్ సాయంతో అయిపోతున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. సరికొత్త ఫీచర్లను అందించేందుకు కంపెనీలు నిరంతరం కృషి చేస్తున్నాయి. మార్కెట్లోకి ఎన్ని కొత్త ఫోన్లు వచ్చినా ఐఫోన్ కు ఉండే క్రేజ్ వేరే లెవల్. అది అందించే ఫీచర్లు […]

Written By: , Updated On : February 17, 2025 / 07:13 PM IST
IPhone

IPhone

Follow us on

IPhone : ప్రస్తుతం మనం ఇంటర్నెట్ యుగంలో జీవిస్తున్నాం. కరోనా వచ్చిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అవసరం అయింది. చాలా పనులు ఇంటర్నెట్ ఆధారంగా స్మార్ట్ ఫోన్ సాయంతో అయిపోతున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. సరికొత్త ఫీచర్లను అందించేందుకు కంపెనీలు నిరంతరం కృషి చేస్తున్నాయి. మార్కెట్లోకి ఎన్ని కొత్త ఫోన్లు వచ్చినా ఐఫోన్ కు ఉండే క్రేజ్ వేరే లెవల్. అది అందించే ఫీచర్లు మరే ఫోన్ లో రావు. కాబట్టి దానిని కొనేందుకు యువత పోటీ పడుతుంటారు. ప్రస్తుతం ఐఫోన్ స్టేటస్ సింబల్ గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఐఫోన్ కొత్త సిరీస్ ఎప్పుడు వచ్చినా షోరూంల దగ్గర జనాలు కిలో మీటర్ల మేర బారులుదీరతారు. ఐఫోన్ కొనుక్కొనేందుకు హత్యలు చేసిన సంఘటనలు లేకపోలేదు. అంత పిచ్చి ఐఫోన్ అంటే యూత్ కు. కాకపోతే ఐఫోన్ కొనాలంటే వేలకు వేలు లక్షలకు లక్షలు పోయాల్సిందే.

అలాంటి ఐఫోన్ అతి తక్కువ రేటుకే వస్తుందంటే ఆ అవకాశం వదులుకుంటారా. అప్పు చేసైనా ఐఫోన్ కొనేస్తారు. కాకపోతే పైకి ఐఫోన్ మాదిరిగా కనిపించే ఫోన్లు అన్నీ ఐఫోన్లు కావని తెలుసుకోవాలి. మరి అది ఐఫోన్ కాదని ఎలా కనిపెట్టాలని ఆలోచిస్తున్నారా. అలాంటి వారి కోసమే భారత ప్రభుత్వం సంచార్ సాథీ యాప్ ను తీసుకొచ్చింది. దీని సాయంతో ఐఫోన్ ఒరిజినల్ నా లేదా నకిలీనా అన్నది తెలుసుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పది వేలకు ఐఫోన్లు, 20వేలకే లేటెస్ట్ ఐఫోన్లని ప్రమోషన్ వీడియోలు ఎక్కవగా వస్తున్నాయి. అలాంటి వాటిని చూసి కొంతమంది ఉత్సాహంతో ఆయా షాపుల దగ్గరకి వెళ్లి ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. తాము కొన్నది ఐఫోనే అని భ్రమపడుతున్నారు. అసలు ఈ ఐఫోన్ నకిలీదని తెలుసుకోవాలని అనుకుంటే కొనే ముందే సంచార్ సాథీ యాప్ ఉపయోగిస్తే ఇట్టే తెలిసిపోతుంది.

సంచార్ సాథీ యాప్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ వాళ్లు లాంచ్ చేశారు. ఈ యాజ్ ఉపయోగించి నో జెన్యూనెన్ ఆఫ్ యూవర్ మొబైల్ హ్యాండ్ సెట్ అనే ఆఫ్షన్ కు వెళ్లి.. క్లిక్ చేయగానే ఫోన్ ఐఎంఈఐ నంబర్ ను అడుగుతుంది. ఆ వెంటనే ఆ నంబర్ ఎంటర్ చేయాలి. ఐఎంఈఐ నంబర్ తెలియకపోతే *#06# నంబర్ టైప్ చేస్తే ఐఎంఈఐ నంబర్ తెలుస్తుంది. దానిని ఆ ఆఫ్షన్ లో ఎంటర్ చేస్తే ఫోన్ వాలీడ్ అని వస్తే అది ఒరిజినల్ ఐఫోన్ అన్నట్లు ఒక వేళ నాట్ వాలీడ్ అని వస్తే అతి నకిలీది అన్నట్లు. ఈ యాప్ ను ఉపయోగించి స్పామ్ కాల్స్ కు కూడా చెక్ పెట్టవచ్చు.