Jan Dhan Yojana: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ బ్యాంక్ అకౌంట్ లేనివాళ్లకు ఉచితంగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వం జన్ ధన్ యోజన పథకం ద్వారా సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి బ్యాంక్ అకౌంట్ ను పొందే ఛాన్స్ కల్పిస్తుండగా జన్ ధన్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు ఇతర బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను కలిగి ఉంటే 2 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమాను పొందవచ్చు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయడం ద్వారా ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫ్రీగా డెబిట్ కార్డును పొందే అవకాశంతో పాటు ఈ కార్డుపై ఉచితంగా ఇన్సూరెన్స్ ను కూడా పొందవచ్చు.
Also Read: నెలకు రూ.10000 పెట్టుబడితో రూ.9 లక్షల పెన్షన్.. ఎలా అంటే?
ఈ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీకి కూడా అర్హులని గుర్తుంచుకోవాలి. గతంలో ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా 5,000 రూపాయల వరకు రుణం తీసుకునే ఛాన్స్ ఉండగా ప్రస్తుతం 10,000 రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం అయితే ఉంది. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత ఉంటుందో లేదో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
అకౌంట్ ను ఓపెన్ చేసిన తర్వాత తరచూ లావాదేవీలను నిర్వహించడం ద్వారా ఈ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: ఈ రూపాయి మీ దగ్గర ఉంటే 2.5 లక్షలు మీవే.. ఎలా అంటే?