With Out Recharge Calls
Recharge Plane : సాధారణంగా ఎవరికి పోన్ చేయాలన్నా.. వచ్చే కాల్స్ రిసీవ్ చేసుకోవాలన్నా మొబైల్ రీచార్జి తప్పనిసరి. రిచార్జి ప్లాన్ ధరలు విపరీతంగా పెంచుతున్నాయి కంపెనీలు. కొందరు ధరల కారణంగా రీచార్జి చేసుకోవడం లేదు. ఒకప్పుడు టెలికాం సంస్థలు నైడ్ ఫ్రీ కాల్స్ అవకాశం కల్పించాయి. మొబైల్ వాడకం అలవాటు చేసేందుకు ఇలా చేశాయి. జియో ప్రారంభంలో కూడా తక్కువ చార్జీతో ఎక్కువ డేటా, అపరిమిత కాల్స్‌కు అవకాశం కల్పించింది. కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేదు. వినియోగారులు పెరగడంతో చార్జీలు పెంచుతున్నాయి టెలికాం సంస్థలు. కొంతకాలం పాటు, కొన్ని మొబైల్ కంపెనీలు ‘ఫ్రీ కాల్స్‘ అందించే ప్రొమోషన్లు అందిస్తాయి. ఉదాహరణగా, జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటివి కొత్త ప్యాకేజీల ద్వారా వో యూజర్లకు ఫ్రీ కాల్స్ చేయాలని అనుమతిస్తాయి. మీరు ఇంస్టాంట్ మెసేజింగ్ లేదా (Vౌజీఛ్ఛి ౌఠ్ఛిట ఐ్క) అప్లికేషన్లు, ఆప్స్ వంటివి (జూమ్, వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేజర్, సిగ్నల్) ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా కాల్స్ చేయవచ్చు. ఇందులో మీకు డేటా రీచార్జ్ అవసరం కానీ, నెట్‌వర్క్ రీఛార్జ్ అవసరం ఉండదు. కొంతమంది సెల్యులర్ ప్రొవైడర్లు మీరు ఫోన్ వాడుతున్నప్పుడు, ప్రత్యేక కాంప్లిమెంటరీ కాల్స్ (Voice over IP) ఇచ్చి ఉంటారు. ఇప్పుడు ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే ఎలాంటి రీచార్జ్ ఛేసుకోకుండా కాల్స్ మాట్లాడొచ్చు.
వైఫై కాలింగ్ ఫీచర్‌తో..
ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న చాలా స్మార్ట్ ఫోన్లు వైఫై కాలింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. ఈ ఫీచర్ ఉన్న మొబైల్ ఉపయోగించి వినియోగదారు మొబైల్ నెట్‌వర్క్ అవసరం లేకుండా కాల్స్ చేయవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. వైఫై కనెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.
వైఫై కాలింగ్ యాక్టివేషన్ ఎలా?
ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేసి, నెట్‌వర్క్, ఇంటర్నెట్ సెట్టింగ్స్‌కు వెళ్లాలి.
– అక్కడ సిమ్‌కార్డు–మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకోండి.
– కాల్ చేయడానికి ఉపయోగించే సిమ్ కార్డు సెలెక్ట్ చేసుకోవాలి.
– కిందకు స్క్రోల్ చేసి వైఫై కాలింగ్ ట్యాగ్‌లు ఎంచుకోవాలి.
తర్వాత వైఫై కాలింగ్ యాక్టివేట్ చేసుకోవాలి.
వైఫై కాలింగ్ యాక్టివేట్ అయిన తర్వాత మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేప్పుడు లేదా రీచార్జి ప్లాన్ ముగిసినప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ కాల్స్ ఆటోమేటిక్‌గా వైఫై ఉపయోగిస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ పోన్‌లో మాత్రమే ఇది పనిచేస్తుంది.