Lic Policy: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. సరళ్ పెన్షన్ పేరుతో ఎల్ఐసీ ఒక పాలసీని అందిస్తుండగా ఈ పాలసీలో ఒకసారి ప్రీమియం చెల్లిస్తే లైఫ్ లాంగ్ పెన్షన్ పొందవచ్చు. 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ నచ్చకపోతే 15 రోజుల్లోగా చెల్లించిన మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు.
ఈ ప్లాన్ నాన్-లింక్డ్, ఇండివిడ్యువల్ ఇమ్మిడియేట్ యాన్యుటీ ప్లాన్ కాగా భాగస్వామితో కలిసి కూడా ఈ పాలసీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీలో రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఈ పాలసీ తీసుకుంటే పాలసీదారుడు బ్రతికున్నంత కాలం పెన్షన్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: Congress: కాంగ్రెస్ ను ఎవరో ఓడించరు.. వాళ్లకు వాళ్లే ఓడిస్తారు!
ఒకవేళ పాలసీదారుడు చనిపోయే నామినీకి కొనుగోలు ధరకు పాలసీ లభిస్తుంది. మరో ఆప్షన్ ను ఎంచుకుంటే పాలసీదారుడి భాగస్వామి బ్రతికున్నంత కాలం పెన్షన్ పొందవచ్చు. ఇద్దరూ మరణిస్తే నామినీకి బీమా చేసిన మొత్తం తిరిగి లభిస్తుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎల్ఐసీ పాలసీదారులకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా 12 వేల రూపాయలు పెన్షన్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. జీవితాంతం పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ కచ్చితంగా బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.
Also Read: AP TDP Mistake: టీడీపీని వెంటాడుతున్న ఆ పెద్ద లోపం.. ఇలా అయితే కష్టమే..!