PPF Scheme: 2022 సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో చాలామంది డబ్బులను ఏ విధంగా పొదుపు చేయాలో అని ఆలోచిస్తున్నారు. డబ్బులను పొదుపు చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చనే సంగతి తెలిసిందే. నెలకు కేవలం 1,000 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా ఏకంగా 12 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్లకు పీపీఎఫ్ స్కీమ్ ఉత్తమమని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ ను కొంతమంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఈ స్కీమ్ లో ఎవరైతే డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు వేర్వేరు బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఆకర్షణీయ రాబడి, రిస్క్ ఫ్రీ రిటర్న్, ట్యాక్స్ బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తం ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే మంచిది.
Also Read: హీరో సాయి ధరమ్ తేజ్ ని కలిసిన కేంద్ర మంత్రి… కారణం ఏంటంటే ?
ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కాగా 15 సంవత్సరాలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఊహించని స్థాయిలో రాబడిని పొందవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం వడ్డీరేట్లలో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీరేటు అమలవుతోంది. నెలకు 1,000 రూపాయల చొప్పున 15 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 3.25 లక్షల రూపాయలు వస్తాయి.
మెచ్యూరిటీ కాలాన్ని మరింత పెంచుకుంటే మరింత ఎక్కువ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 30 సంవత్సరాల పాటు ఈ విధంగా పెట్టుబడిని కొనసాగిస్తే 12.36 లక్షల రూపాయలు చేతికి వస్తాయి. పీపీఎఫ్ స్కీమ్‌లో 500 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.