Bank Loan : బ్యాంకు Loan తీసుకుంటున్నారా? దీనిపై అవగాహన లేకపోతే భారీగా నష్టపోతారు..

లోన్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే చాలా మంది ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఓ విషయంలో మాత్రం లోన్ తీసుకునే వారు భారీగా మోసపోతున్నారు. అయితే లోన్ తీసుకునే ముందే ఈ విషయంపై క్లారిటీ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి ఏ విషయంలో వినియోగదారులు మోసపోతున్నారు? ఆ వివరాల్లోకి వెళితే.

Written By: Srinivas, Updated On : October 15, 2024 10:55 am

 Bank Loan

Follow us on

Bank Loan :  కాలం మారుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ఖర్చులకు సరిపడా ఆదాయం రావడం లేదు. ఈ క్రమంలో కొన్ని ప్రత్యేక అవసరాలు తీరడానికి సరిపడే ఆదాయం ఉండడం లేదు. ఇల్లు కట్టుకోవాలనుకున్నా.. బైక్ లేదా కారు కొనాలన్నా ఒకే మొత్తంలో చెల్లించడానికి డబ్బు పొదుపు కావడం లేదు. దీంతో చాలా మంది బ్యాంకు రుణం తీసుకొని వారి అవసరాలు తీర్చుకుంటారు. కొన్ని వస్తువుల కొనుగోలుపై బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ ఉంటాయి. దీంతో చాలా మంది హోమ్ లోన్, కారు లోన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ లోన్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే చాలా మంది ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఓ విషయంలో మాత్రం లోన్ తీసుకునే వారు భారీగా మోసపోతున్నారు. అయితే లోన్ తీసుకునే ముందే ఈ విషయంపై క్లారిటీ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి ఏ విషయంలో వినియోగదారులు మోసపోతున్నారు? ఆ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుత రోజుల్లో ప్రతీ అవసరం కోసం దాదాపు బ్యాంకు రుణంపైనే ఆధారపడుతున్నారు. ఉద్యోగులకు ఈ సౌకర్యం సులభంగా ఉంటుంది. నెలనెలా జీతం రూపంలో ఆదాయం వస్తుంది కనుక.. ఈఎంఐ చెల్లించడానికి అనువుగా ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు సైతం బ్యాంకు రుణం ద్వారానే వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకు లోన్ విషయంలో కొందరికి పూర్తిగా అవగాహన ఉండదు. లోన్ తీసుకునే సమయంలో వడ్డీ ఎంత పడుతుంది? ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందా? లేదా? టెన్యూర్ ఎంతకాలం? అనే విషయాలు గ్రహిస్తారు. కానీ లోన్ ప్రీ క్లోజ్ చేసే సమయంలో బ్యాంకులు మెలిక పెడుతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

చాలా మంది బ్యాంకు రుణం తీసుకున్నా.. వివిధ మార్గాల నుంచి డబ్బు రావడంతో ఆ లోన్ ను ముందే పూర్తి చేయాలని అనుకుంటారు. దీంతో వడ్డీ భారం పడుతుందని అనుకుంటారు. ఇలా చేయడం వల్ల చాలా సేఫ్ అవుతుందని భావిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు ఇలా ప్రీ క్లోజ్ చేసే వారి నుంచి వడ్డీలు వసూలు చేస్తుంటాయి. దీనిని ప్రీ క్లోజ్ ఛార్జీస్ అంటారు. అంటే బ్యాంకు రుణం ముందుగా క్లోజ్ చేయాలనుకున్నా.. టెన్యూర్ కాలానికి సంబంధించిన వడ్డీని చెల్లించాల్సిందేనని బ్యాంకులు చెబుతాయి. అయితే ఇక్కడ ఓ విషయాన్ని ముందే క్లారిటీ చేసుకోవాలి.

బ్యాంకు రుణం తీసుకునే సమయంలో ముందుగానే ఎలాంటి వడ్డీని సెలెక్ట్ చేసుకుంటున్నారో ముందే తెలుసుకోవాలి. వీటిలో Floating Interest Rate ప్రకారం లోన్ తీసుకుంటే ఎలాంటి ప్రీ క్లోజ్ ఛార్జెస్ వసూలు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే Fixed Interest Rate ప్రకారం లోన్ తీసుకున్నట్లయితే ప్రీ క్లోజ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల బ్యాంకు లోన్ తీసుకునే ముందే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా లోన్ తీసుకుంటే ఆర్బీఐ ప్రకారం వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లోన్ పై వడ్డీ శాతం పెరుగుతుంది. ఫిక్స్ డ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఒకే రకమైన వడ్డీ ఉంటుంది. దీనిని కూడా గమనించాలి.