Credit Card: క్రెడిట్ కార్డులో సంబంధం లేని ట్రాన్జాక్షన్ జరిగితే డబ్బులు వెనక్కి వస్తాయి.. ఎలాగో తెలుసా?

మన కార్డు మన వద్దనే ఉన్నా.. ఎలాంటి ఓటీపీ చెప్పకున్నా.. ఎలాంటి లింకులను క్లిక్ చేయకున్నా మన క్రెడిట్ కార్డు నుంచి డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వస్తే వెంటనే స్పందించాలి. 24 గంటల్లో సంబంధిత కార్డు జారీ చేసిన బ్యాంకుకు వెళ్లాలి.

Written By: Neelambaram, Updated On : June 20, 2024 5:08 pm

Credit Card

Follow us on

Credit Card: ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగింది. ఆన్ లైన్ షాపింగ్, ఆఫ్ లైన్ షాపింగ్, కిరాణాలో చిన్న చిన్న వస్తువులు కొన్నా కూడా క్రెడిట్ కార్డుల (రూపే) నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తున్నాం. దీనికి కేవలం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్ లు ఉంటే చాలు క్షణాల్లో ట్రాన్జాక్షన్ చేయవచ్చు. నెలంతా ఖర్చు పెట్టి ఒక్క సారి సాలరీ పడంగానే కట్టుకోవచ్చు. అందుకే క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. 2014కు ముందు క్రెడిట్ కార్డులు అంటే కేవలం బాగా డబ్బున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం మధ్య తరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చాయి.

అయితే క్రెడిట్ కార్డులతో మేలే కాదు.. కీడు కూడా ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే. ఒక్కో సారి మనకు తెలియకుండా వందలు, లేదంటే వేల రూపాయల ట్రాన్జాక్షన్ జరుగుతుంది. అప్పుడు మనం షాక్ కు గురవుతాం. మన వద్దే కార్డు ఉన్నా వినియోగం మాత్రం జరుగుతుంది. వేలాది రూపాయలు కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతాం. అయితే ఇలా చేస్తే మన డబ్బును బ్యాంకులు మన అకౌంట్ కు పంపిస్తాయి.

మనం ఏం చేయాలి?
మన కార్డు మన వద్దనే ఉన్నా.. ఎలాంటి ఓటీపీ చెప్పకున్నా.. ఎలాంటి లింకులను క్లిక్ చేయకున్నా మన క్రెడిట్ కార్డు నుంచి డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వస్తే వెంటనే స్పందించాలి. 24 గంటల్లో సంబంధిత కార్డు జారీ చేసిన బ్యాంకుకు వెళ్లాలి. తన కార్డు వివరాలు చెప్పాలి. తన ప్రమేయం ఏ విధంగా లేకున్నా ఇంత డబ్బు కట్ అయ్యాయని ఫిర్యాదు చేయాలి. ఒక వేళ సదరు బ్యాంకు సిబ్బంది పట్టించుకోకుంటే వెంటనే అంబుడ్స్ మెన్ కు కంప్లయింట్ చేయాలి.

అసలు విషయం ఏంటంటే కార్డు మన వద్ద ఉండీ, మన ప్రమేయం లేకుండా డబ్బు కట్ అయితే సదరు బ్యాంకులు మన కార్డుకు సంబంధించి వారే పూర్తి డబ్బును కడతారు. మనపై రూపాయి భారం కూడా మోపరు. ఇలా పోయిన డబ్బును మన క్రెడిట్ కార్డు ఖాతాకు జమ చేసుకోవచ్చు.