https://oktelugu.com/

సూపర్ స్కీమ్.. ఏడాదిలో రూ.లక్షకు మూడు లక్షల రూపాయలు..?

ప్రస్తుతం చేతిలో ఉన్న డబ్బులతో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకునే వాళ్లకు ఐసీఐసీఐ శుభవార్త చెప్పింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కమోడిటీస్ ఫండ్ ద్వారా కస్టమర్లు తక్కువ సమయంలోనే అదిరిపోయే లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కేవలం ఏడాదిన్నర సమయంలోనే ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు కళ్లు చెదిరే లాభాలను పొందారు. మధ్యతరహా రిస్క్‌ తో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. 18 నెలల క్రితం ఐసీఐసీఐ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 7, 2021 / 05:26 PM IST
    Follow us on

    ప్రస్తుతం చేతిలో ఉన్న డబ్బులతో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకునే వాళ్లకు ఐసీఐసీఐ శుభవార్త చెప్పింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కమోడిటీస్ ఫండ్ ద్వారా కస్టమర్లు తక్కువ సమయంలోనే అదిరిపోయే లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కేవలం ఏడాదిన్నర సమయంలోనే ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు కళ్లు చెదిరే లాభాలను పొందారు. మధ్యతరహా రిస్క్‌ తో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పవచ్చు.

    18 నెలల క్రితం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కమోడిటీస్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ప్రస్తుతం ఏకంగా రూ.2.8 లక్షలు వచ్చాయి. తక్కువ సమయంలోనే ఐసీఐసీఐ భారీ లాభాలను తెచ్చిపెట్టడం గమనార్హం. ఈ మ్యూచువల్ ఫండ్ గత ఏడాది కాలంలోనే ఏకంగా 170 శాతం రాబడిని అందించగా ఈ స్థాయిలో రాబడిని అందించిన స్కీమ్ మరొకటి లేదనే చెప్పాలి. ఎవరైతే ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ల డబ్బులు కమోడిటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ అవుతాయి.

    కెమికల్స్, సిమెంట్, మెటల్స్, ఫెర్టిలైజర్స్ ఇలా కమోడిటీ షేర్లలో ఈ ఫండ్ డబ్బులు ఇన్వెస్ట్ అవుతాయి. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఎక్కువ సమయం వేచి చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కమోడిటీస్ ఫండ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

    బ్యాంకులు ప్రస్తుతం గతంతో పోలిస్తే తక్కువ వడ్డీని ఇస్తున్నాయి. కరోనా వల్ల గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి సమయంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కమోడిటీస్ ఫండ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.