Hyundai New Car:కొరియా కంపెనీ హ్యుందాయ్ భారత్ కార్ల మార్కెట్లో తమ ఉత్పత్తులతో దూసుకుపోతుంది. ఈ కంపెనీ ఎక్కువగా SUVలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎస్ యూవీ అనగానే అధిక ధర ఉంటుందనే భావన అందరికీ ఉంటుంది. కానీ హ్యుందాయ్ లేటేస్ట్ గా రూ.10 లక్షల లోపు టర్బో ఇంజిన్ తో కూడిన ఎస్ యూవీని అందిస్తోంది. దీని పనితీరుతో పాటు ఆకర్షించే డిజైన్ ఉండడం వల్ల దీనిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇంతకీ ఈ కారు ఎలా ఉందంటే?
కార్ల వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త డిజైన్ లో అందించాలని హ్యుందాయ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘వెన్యూ ఎగ్జిక్యూటివ్’ వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త మిడ్ స్పెక్ వేరియంట్ తక్కువ ధరకు అందిస్తున్నామని తెలుపుతున్నారు. అయినా ఇందులో టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు అద్భుతమైన ఫీచర్స్ ను అమర్చారు. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ యూనిట్ 118 బీహెచ్ పీ పవర్, 172 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది.
వెన్యూ ఎగ్జిక్యూటి ఇన్నర్ స్పేస్ ఆకర్షిస్తుంది. ఇందులో 8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిజిటల్ సిస్టమ్ క్లస్టర్, రియర్ వైపర్, ఉన్నాయి. ఏసీ వెంట్లతో పాటు రెండు దశల రిక్లైనింగ్ ఆకర్షిస్తాయి. ఇక పోల్డింగ్ సీట్లు సౌకర్యవంతంగా ఉన్నాయి. ఈ కారుకు 16 ఇంచుల స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ లో డార్క్ క్రోమ్ ఫినిషిగ్ తో రూప్ పట్టాలు, టెయిల్ గేట్ లో ఎగ్జిక్యూటివ్ బ్యాడ్జ్ ఉన్నాయి. మొత్తంగా కారు చూడ్డానికి ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంటుంది.
కొత్త హ్యుందాయ్ కారు ఇప్పటికే మార్కెట్లో ఉన్న నిస్సాన్ మాగ్నైట్ టర్బో, రెనాల్ట్ కిగర్ టర్బో, కియా సోనెట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో దీని ధర రూ.10.49 లక్షల వరకు ఫిక్స్ చేశారు. అయితే ఆన్ రోడ్ లో ఆయా ప్రాంతాలను బట్టి ఈ ధర మారుతుంది. హ్యుందాయ్ నుంచి వచ్చిన వెన్యూ ఎస్(ఓ) వేరియంట్ కంటే కొత్త వెన్యూ ఎగ్జిక్యూటివ్ రూ.1.75 లక్షలు తక్కువగా ఉంటుంది. అందువల్ల తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్ కావాలంటే ఈ కారును కొనుగోలు చేయొచ్చని అంటున్నారు.