Homeబిజినెస్Hyundai upcoming cars 2026: Hyundai సంచలన నిర్ణయం.. త్వరలో మూడు అద్భుతమైన కార్లు.. వీటి...

Hyundai upcoming cars 2026: Hyundai సంచలన నిర్ణయం.. త్వరలో మూడు అద్భుతమైన కార్లు.. వీటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Hyundai upcoming cars 2026: కార్ల కంపెనీ Hyundai తన ప్రాధాన్యతను విస్తరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నో కార్లను తీసుకువచ్చిన ఈ కంపెనీ ఈ ఏడాదిలో మరో మూడు మోడల్స్ ను రోడ్లపై తిప్పడానికి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించింది. ప్రస్తుతం ఎక్కువగా వినియోగదారులు కోరుకుంటున్న ఎలక్ట్రిక్ కారుతోపాటు SUV వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటి గురించి ఇప్పటికే ఆన్లైన్లో సమాచారాన్ని అందించిన కంపెనీ వాటి ధరలను కూడా పరోక్షంగా తెలిపింది. అయితే ఇందులో ఉండే ఫీచర్స్, ఇంజన్ పనితీరుపై చాలామంది రకాలుగా అంచనా వేస్తున్నారు. ఈ కార్లు ఎలా ఉండబోతున్నాయి అంటే..

Hyundai కంపెనీ నుంచి ఈ ఏడాది జూన్ లోగా Inster అనే కొత్త కారు రాబోతుంది. ఇది ఎలక్ట్రిక్ SUV గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఈ వేరియంట్ ను ప్రవేశపెట్టారు. వాటిలో టాటా పంచ్ EV గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే Inster కారుపై ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. దీనికి గ్రాఫిక్ LED హెడ్ లాంప్స్ ఉండనున్నాయి. దీంతో కారుకు ప్రత్యేకమైన లుక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్నర్ లో 10.25 అంగుళాల స్క్రీన్ సెటప్, వైర్లెస్ ఛార్జింగ్ వంటివి సౌకర్యాన్ని అందిస్తాయి. ఇందులో 42 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల మైలేజ్ అందించే అవకాశం ఉంది. అలాగే 49 కిలో వాట్ బ్యాటరీ కూడా ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా రూ.12 లక్షలు గా పేర్కొంటున్నారు.

Hyundai నుంచి రాబోతున్న మరో కారు ఐయోనిక్ 6. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ టెక్నాలజీతో E GMP ప్లాట్ ఫామ్ పై నిర్మితమవుతుంది. ఇందులో 53 కిలోమీటర్ 77.4 కిలోవాట్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 631 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది పూర్తిగా ఏరా డైనమిక్ సామర్థ్యం ను కలిగి ఉంటుంది. దీనిని రూ. 50 నుంచి 65 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుపుతున్నారు

Hyundai నుంచి రాబోతున్న మరో కారు వెన్యూ. దీనిని ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. కాంపాక్ట్ SUV గా ఇప్పటికే ఆదరణ పొందిన ఈ కారణం పూర్తిగా రీ డిజైన్ చేయనున్నారు. ఈ కొత్త కారు 200 ఎం ఎం పొడవైన వీల్ బేస్ ఉండనుంది. దీంతో దూర ప్రయాణం చేసేవారికి ఎలాంటి అలసట ఉండదు. ఇన్నర్ డిజైన్ విషయానికి వస్తే 12.3 అంగుళాల స్క్రీన్ చూడొచ్చు. లెవెల్ 2 టెక్నాలజీతో ఉన్న ఇందులో పనోరమిక్ డిజైన్ కూడా ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ నాచురల్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉండనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version